బండ్ల భావోద్వేగం.. నా కొడుకు చనిపోతా అంటున్నాడు…ఆపండ్రా బాబు..కన్నీళ్లు పెట్టుకున్న గణేష్..

437

బలవంతుడు బలహీనున్ని భయపెట్టి బ్రతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ ఛేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది.. జనతాగ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చెయ్యబడును’ అని జనతాగ్యారేజ్‌ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. నిజమే.. ఆ సినిమాలో బలహీనుడి వైపున బలంగా ఎన్టీఆర్ నిలబడతాడు. కాని అది సినిమా.. వాస్తవ జీవితంలో బలహీనుడు అనే మాటవినిపిస్తే.. రాళ్లు పట్టుకుని విసిరేందుకు సిద్ధంగా ఉంటారు కొందరు. అందులోనూ కొందరు మీడియా ప్రతినిధులే బలహీనుడిపై రాళ్లు విసిరేందుకు ముందు వరసలో నిలబడటం ఇంకా దౌర్భాగ్యం.తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో పీక కోసుకుని చనిపోతా’ అంటూ కాంగ్రెస్ యువ నాయకుడు, ఒకప్పటి బడా ప్రొడ్యుసర్ కమ్ కమెడియన్ బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆ ప్రకటన చేసింది మొదలు నెటిజన్ల బండ్ల గణేష్‌కి చుక్కలు చూపించారు. దాంతో మీడియా సాక్షిగా బండ్ల గణేష్ బాధపడుతున్నాడు. మరి ఆయనేమన్నాడో చూద్దామా.

Image result for bandla ganesh

తాను చేసిన బ్లేడ్‌తో పీక కోసుకుంటా వ్యాఖ్యల పట్ల వివరణ ఇస్తూ భావోద్వేగానికి గురి అయ్యారు బండ్ల గణేష్. ‘నాకు ఆత్మహత్య చేసుకునే అవకాశం రాదనే నమ్మకంతోనే నేను ఆ రోజు ఆ వ్యాఖ్యలు చేశా. యుద్ధం చేసేటప్పుడు సైనికుడ్ని, ఆటలు ఆడేటప్పుడు ఆటగాళ్లని, ఎలక్షన్ టైంలో ప్రజల్ని ఎన్నోరకాల మాటలు అంటా. వాటిని పట్టించుకోకూడదు.భారత ప్రధాని పోస్ట్‌లో ఉండి మోదీగారు నోట్ల రద్దు సమయంలో 50 రోజుల్లో దేశ ఆర్ధిక పరిస్థితి మారకపోతే ఉరి తీయండి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడ్ని ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటా అన్నారు సీఎం కేసీఆర్. అవన్నీ నిజం అయ్యాయా? మీరు అడగగలిగారా? అవి కేవలం ప్రజల్ని ఉత్తేజ పరచడానికి మాత్రమే. నేనూ కూడా మా నాయకుల్ని ఉత్తేజ పరడానికే అలా మాట్లాడా. అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గలేదు. నేల విడిచి సాము చేసే మాటలు మాట్లాడదల్చుకోలేదు. అలా మాట్లాడితే వీడు జోకర్‌రా అనుకునే పరిస్థితి ఉంది. రాజకీయాల్లో 7 ‘O’ Clock, 8 ‘O’ Clock బ్లేడ్‌లు పనిచేయవు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకోవాలని మీకు ఉంటే.. మీకే బ్లేడ్ ఇస్తా కోసేయండి. నాకూ ఓ కుటుంబం ఉంది. వాళ్లూ ఇబ్బంది పడతారు అనేది లేకుండా సోషల్ మీడియా, మీలాంటి యాంకర్లు నాపై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. నా కొడుకు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వాడు నా గురించి భయపడుతున్నాడు. వాడు నాన్నా.. నీ దగ్గరకి వచ్చి పడుకుంటా.. మీరు పీక కోసుకుని చనిపోతా అన్నారట కదా భయంగా ఉంది అంటూ నా వెనుకనే సెక్యురిటీని పంపిస్తున్నాడు. వాడు ఎంత భయపడితే అలా అంటాడు. వాడికి ఓ కుటుంబం ఉంటుంది.. వాళ్లకు ఓ పద్దతి ఉంటుంది అని కొంతైనా జ్ఞానం లేకపోతే ఏం చేయాలి. సరే.. నేను ఏదో అన్నాను.. నాలా అన్న వాళ్లు చాలా మంది ఉన్నారు కదా.. వాళ్లందరి దగ్గరకూ వెళ్లారా? అంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు బండ్ల గణేష్. బండ్ల గణేష్ చెప్పింది కూడా నిజమే కదా. కనీసం ఇకమీద అయినా అతనిని ట్రోల్ చెయ్యడం మానేస్తారని ఆశిస్తున్నాం. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. బండ్ల గణేష్ ను టార్గెట్ చేసి ట్రోల్స్ వెయ్యడం గురించి అలాగే ఇప్పుడు బండ్ల గణేష్ భావోద్వేగంతో మాట్లాడిన మాటల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.