బాధపడకు మహేష్….. బాధపడకుండా ఎలా ఉంటాను సర్..చనిపోయింది మా పిన్ని… బాలయ్య మహేష్ బాబు

230

ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల ఈనెల 27న కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో 27వ తేదీ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భార్య మృతితో కృష్ణ శోకసంద్రంలో ముగినిపోయారు. 50 ఏళ్లుగా ఒకరినొకరు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా జీవించారు. ఎక్కడివెళ్లినా, ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అలాంటి జీవిత భాగస్వామి ఒక్కసారిగా తనను ఒంటరిని చేసి వెళ్లిపోవడంతో ఆ బాధను తట్టుకోవడం కృష్ణ వల్ల కాలేదు. కన్నీమున్నీరు అయ్యారు.శోకసంద్రంలో ముగినిపోయిన కృష్ణను ప్రముఖులంతా పరామర్శిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇప్పుడు చంద్రబాబు, బాలయ్య.. కృష్ణను ఓదార్చారు.

Image result for vijaya nirmala

కృష్ణను టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, గల్లా జయదేవ్‌తో కలిసి ఆదివారం హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని కృష్ణ ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. కాసేపు ఆయనతో మాట్లాడారు. వీరి వెంట సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయనిర్మల తనయుడు వీకే నరేష్ కూడా ఉన్నారు. కృష్ణను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. విజయనిర్మల మరణవార్త తనను ఎంతగానో బాధ కలిగించిందని అన్నారు. నటిగానే కాకుండా రాజకీయ నేతగా ఆమెతో దగ్గర సంబంధాలున్నాయని చంద్రబాబు చెప్పారు. 1999లో టీడీపీ తరఫున కైకలూరు నుంచి విజయనిర్మల పోటీచేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తుచేశారు. కృష్ణ కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక కృష్ణను పరామర్శించడానికి వెళ్లిన బాలయ్య మహేష్ బాబుతో ముచ్చటించారు. బాలయ్య కృష్ణను ఓదార్చాడు ఆ తర్వాత మహేష్ బాబుతో మాట్లాడాడు. మహేష్ తో బాలయ్య మాట్లాడుతూ..బాధపడకండి. ఇలాంటి సమయంలోనే గుండెను నిబ్బర చేసుకోవాలి అని అన్నాడు. అప్పుడు మహేష్..బాధపడకుండా ఎలా ఉంటాం సర్. పేరుకు పిన్ని అయినా కూడా కన్నతల్లిలాగా చూసుకుంది. కుటుంబం మొత్తంను ఇన్ని రోజులు కంటికి రెప్పలా చూసుకుంది. సొంత తల్లిని కోల్పోయినంత బాధగా ఉంది అని అన్నాడు. అప్పుడు బాలయ్య..సరేలే జరిగింది జరిగిపోయింది. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి. నిర్మలమ్మ గారు లేకుండా అయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు అయన ఎంత బాధలో ఉండి ఉంటారో మాకు అర్థం అవుతుంది కాబట్టి ఆయనను జాగ్రత్తగా చూస్కోండి అని చెప్పి వెళ్ళిపోయాడు బాలయ్య. బాలయ్య అలా నాన్నగారి గురించి చెప్పేసరికికన్నీళ్ళపుకోలేకపోయాడంట మహేష్ బాబు. ఏది ఏమైనా విజయ నిర్మల మరణం ఘట్టమనేని ఇంట్లో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. మరి మహేష్ బాబు బాలయ్య మధ్య జరిగిన డిస్కషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.