మరో అరుదైన గౌరవం దక్కించుకున్న బాహుబలి

259

భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన సినిమా బాహుబలి.తెలుగువాడి సత్తాను ప్రపంచం మొత్తం కొనియాడింది.ఈ సినిమాను ప్రపంచం మొత్తం కొనియాడింది. అయితే ఇప్పుడు ‘బాహుబలి’ మరో అరుదైన అవకాశం దక్కించుకుంది. లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘బాహుబలి.. ది బిగినింగ్’ పాటలు ఆహుతులను అలరించనున్నాయి.

పదేళ్ల సినీ సంగీతోత్సవాన్ని పురస్కరించుకుని 2019లో ఓ కన్సర్ట్ నిర్వహించనున్నట్టు రాయల్ ఆల్బర్ట్ హాల్ ప్రకటించింది. ఈ సందర్భంగా హ్యారీ పోటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్, స్కైఫాల్, బాహుబలి ది బిగినింగ్ సినిమాల పాటలను వేదికపై వినిపించనున్నారు. శుక్రవారం నుంచి టిక్కెట్ల అమ్మకం మొదలుకానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.ఆ మూవీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వేదికను పంచుకోనున్నారని తెలిపింది.

బాహుబలి సినీ సంగీత విభావరిని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆ సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. గతేడాది తాను అక్కడి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బాహుబలికి కూడా అవకాశం వస్తే బాగున్ననని భావించానని.. ఏ దేవతలు తథాస్తు అన్నారో కానీ.. ఇప్పుడదే నిజమైందని ట్వీట్ చేశారు.