క్వీన్ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ లో తమన్నా సూపర్.

240

2014 మార్చిలో బాలీవుడ్ లో రిలీజ్ అయిన ‘క్వీన్’ అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. కంగనా రనౌత్ నటించిన ఈ సినిమాను సౌత్ లో కొన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగుతో పాటు.కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో లీడ్ రోల్ లో కాజల్..మలయాళంలో మాంజిమా మోహన్.. కన్నడలో పరుల్ యాదవ్ లు టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు.

Image result for దటీజ్ మహాలక్ష్మి

తెలుగులో మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తమన్నా లీడ్ రోల్‌లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.మనుకుమారన్ నిర్మాత.ఈ చిత్రానికి అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నారు…‘దటీజ్ మహాలక్ష్మి’అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

దీంతో ఓ వైపు చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తూనే.. చిత్ర ప్రమోషన్స్ దిశగా అడుగులు వేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇందులో భాగంగా డిసెంబర్ 21న చిత్ర టీజర్ విడుదల చేయబోతున్నారు.దానికి సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు.