ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ వ‌చ్చేస్తోంది.

394

ప్రశాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి ఈ సినిమా హిందీ లో కంగనా రనౌత్ నటించిన సూపర్ హిట్ చిత్రం క్వీన్ రీ మేక్ గా తెరకెక్కుతుంది… అవె ఫెమ్ ప్రశాంత్ వర్మఎంతో క్రియేటివ్ గా ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్నారు… ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న త‌మ‌న్నా అభిమానుల‌కు, ఓ గుడ్ న్యూస్ వ‌చ్చింది.ఈ చిత్రం అక్టోబర్ నెలలో విడుదల కానుంది.

Image result for thamana

ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో తెలుగులో త‌మ‌న్నా న‌టిస్తుండగా…ఇక తెలుగు తో పాటు గా తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో ఈ క్వీన్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. తమిళ భాషలో కాజల్ ప్రధాన పాత్రలో పారిస్ పారిస్ పేరుతో అలాగే కన్నడలో పరుల్ యాదవ్ ప్రధాన పాత్రలో బట్టర్ ఫ్లై పేరుతో రమేష్ అరవింద్ తెరకెక్కిస్తున్నారు. ఇక మళయాళం లో మంజిమ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘జాం జాం’ అనే టైటిల్ తో నీలకంఠ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. మ‌రి ఈ సినిమా పై కూడా ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి… చూడాలి ఎటువంటి రెస్పాన్స్ అభిమానుల‌ నుంచి వ‌స్తుందో.