తన పెళ్లి వార్తల మీద స్పందించిన తాప్సీ..

339

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగువారికి పరిచయమైన బ్యూటీ తాప్సీ.ఆ సినిమా తర్వాత ప్రభాస్, రవితేజ వంటి హీరోలతో కలిసి నటించింది. తెలుగులో ఎంత కష్టపడ్డప్పటికీ బ్రేక్ రాకపోయేసరికి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి పేరుతెచ్చుకుంది. అమితాబ్ బచ్చన్ తో కలిసి చేసిన పింక్ సినిమా చేసింది.

అయితే తాప్పీ త్వరలోనే ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారుడ్ని పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ వెబ్‌సైట్ మరో అడుగు ముందుకేసి గోవాలో తాప్సీకి ఇటీవల నిశ్చితార్థం జరిగిందని పెళ్లికి సంబంధించిన డేట్స్‌ కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు రాసుకొచ్చింది. అంతేకాకుండా నిశ్చితార్థం కోసమే తాప్సీ తల్లిదండ్రులు ఇటీవల గోవాకి వెళ్లి వచ్చినట్లు ఆ వైబ్‌సైట్‌లో రావడంతో తాప్సీ స్పందించింది.

‘నాకు నిశ్చితార్థం జరిగిందా..? నిజమా..? అయితే.. నన్ను పిలవలేదు..? మా అమ్మానాన్న గత దశాబ్దంగా గోవావైపు వెళ్లింది లేదు. ఆ వెబ్‌సైట్‌లో రాసింది నిజమైతే.. ఆ లెక్క ప్రకారం నాకు పదేళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందా..?’ అని తాప్సీ ఘాటుగా స్పందించింది.