పెళ్ళికి సిద్దపడ్డ తాప్సీ..వరుడు ఎవరో కాదు మన అందరికి తెలిసినవాడే..

1131

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగువారికి పరిచయమైన బ్యూటీ తాప్సీ.ఆ సినిమా తర్వాత ప్రభాస్, రవితేజ వంటి హీరోలతో కలిసి నటించింది. తెలుగులో ఎంత కష్టపడ్డప్పటికీ బ్రేక్ రాకపోయేసరికి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి పేరుతెచ్చుకుంది. అమితాబ్ బచ్చన్ తో కలిసి చేసిన పింక్ సినిమా చేసింది.అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఒక ఇంటిది కాబోతుంది అని వార్తలు వస్తున్నాయి.

తాప్సీ బాడ్మింటన్‌ స్టార్‌ మాథ్యూస్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.రీసెంట్ గా తాప్సీ తన లవర్‌ మాథ్యూస్‌తో కలిసి గోవాకి వెళ్లినట్లు సమాచారం. ఇద్దరు మాత్రమే వెళితే విహారానికి అని సరిపెట్టుకోవచ్చు. వారిద్దరే కాకుండా వారితో తాప్సి పేరెంట్స్, బంధువులు కూడా వెళ్లినట్లు సమాచారం.అక్కడే ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని జోరుగా ప్రచారం సాగుతోంది.

తాప్సి ప్రస్తుతం సైన్ చేసిన సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే తాప్సి స్పందించాల్సిందే.