షూటింగ్‌ నుంచి భర్త లేట్‌గా వస్తున్నాడని నటుడి భార్య ఆత్మహత్య

239

చిన్న చిన్న విషయాలకే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వివాదాలు వస్తున్నాయి.. అసలు చిలికి చిలికి గాలివానలా ఆ గొడవలు మారి చనిపోయే పరిస్దితికి కూడా వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలాంటి దారుణమైన పనిచేశాము అని చివరికి ఆలోచించినా , ప్రాణాలు కోల్పోతున్న కుటుంబ సభ్యులు ఉంటున్నారు. తాజాగా ఓ టీవీ నటుడి భార్య చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.టీవీ నటుడైన భర్త షూటింగుల నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడన్న ఆవేదనలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మణికొండలో మంగళవారం చోటుచేసుకుంది. టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న మధుప్రకాష్‌కు గుంటూరుకు చెందిన భారతితో 2014లో వివాహమైంది. భారతి మణికొండలోని పంచవటి కాలనీలో భర్తతో పాటు అత్తమామలు, మరదితో కలిసి ఉంటోంది… ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది.

షూటింగ్ కోసం రోజూ ఉదయం బయటకు వెళ్లే మధుప్రకాష్ అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుంటారు. దీంతో భర్త తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసేశారు. దీనిపై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి ఆలస్యంగా వచ్చిన భర్తపై భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరూ వేర్వేరు గదులో పడుకున్నారు. మంగళవారం ఉదయం నిద్ర లేచిన మధుప్రకాష్ జిమ్‌కు వెళ్లి అక్కడి నుంచే షూటింగ్‌కు వెళ్లిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన భారతి భర్తకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. ఆందోళన చెందిన మధు సాయంత్రం 7గంటల సమయంలో ఇంటికి రాగా బెడ్‌రూమ్ తలుపు వేసి ఉంది. ఎంతగా పిలిచిన ఆమె స్పందించకపోవడంతో మారుతాళంతో తలుపు తెరవగా భారతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

ఈ క్రింది వీడియో ని చూడండి

దీంతో మధుప్రకాష్ రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్తతో పాటు ఆమె అత్తమామలను ప్రశ్నించారు. భారతి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.