Breaking News : నటి ఝాన్సీ ఆత్మహత్య… షాక్ లో సినీ ప్రముఖులు

4087

సినీ సెలెబ్రిటీలు వరుసగా చనిపోతున్నారు. ఆరోగ్యం బాగాలేక కొందరు రోడ్డు ప్రమాదాలలో కొందరు వివిధ కారణాల వలన ఆత్మహత్య చేసుకుని కొందరు చనిపోతున్నారు. వెండితెర బుల్లితెర మీద నటించి మనల్ని అలరించే నటీనటులు వివిధ కారణాల వలన ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు వర్దమాన టీవీ నటి ఝాన్సీ బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్లోని శ్రీనగర్కాలనీలో తన నివాసంలో ఆమె మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాటీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది ఝాన్సీ. అయితే ఝాన్సీ బలవన్మరణానికి ప్రేమ వ్యవహరమే కారణమని తెలుస్తోంది. సూర్య అలియాస్ నానితో పరిచయం అయిన తర్వాత ఝాన్సీ సీరియల్స్ మానేసిందని ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు.

వివాహం చేసుకోమంటే అతడు ముఖం చాటేసినట్టు తెలిపారు. సూర్య తనను మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురైన ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. మంగళవారం రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకున్న ఝాన్సీని, ఆఫీసు నుంచి వచ్చిన ఆమె సోదరుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, అప్పటికే ఆమె మృతిచెందినట్టు నిర్ధరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గాంధీ హాస్పిటల్కు మృతదేహాన్ని తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్య కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఆవకాశాలు తగ్గిపోవడం, సూర్యతో ప్రేమ వ్యవహారంలో విఫలమవడమే ఆత్మహత్యకు కారణమని అంటున్నారు. మంగళవారం ఉదయం సూర్యతో గొడవ జరిగినట్టు ఆమె బంధువులు తెలియజేశారు. గత మూడు నెలలుగా సూర్య, ఝాన్సీలు గొడవపడుతున్నట్టు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని కడలి గ్రామానికి చెందిన ఝాన్సీ, సినిమాల్లో అవకాశాలు వెదుక్కొంటూ హైదరాబాద్కు వచ్చింది. పవిత్రబంధం సీరియల్తోపాటు మరో రెండు సినిమాల్లోనూ నటించిన ఆమె, తన తల్లి, సోదరుడితో కలిసి శ్రీనగర్కాలనీలో నివాసం ఉంటోంది. ఈమె మరణవార్త విన్న తోటి నటీనటులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె మృతికి నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం. మరి ఝాన్సీ గురించి అలాగే ఆమె ఆత్మహత్య చేసుకోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.