సినిమాహాల్లో ఎమ్మార్పీల‌కే డ్రింక్స్ తినుబండారాలు లేక‌పోతే జైలుకే

354

సినిమాకు వెళితే జేబులుగుళ్ల అయిపోతాయి అని బాధ‌ప‌డుతూ ఉంటారు చాలా మంది.. సినిమాటికెట్ ధ‌ర‌లుఎంత ఉంటాయో దానికి మించి అక్క‌డ తినుబండారాల ధ‌ర‌లు ఉంటున్నాయి.. సినిమాకు న‌లుగురు ఉండే ఫ్యామిలీ వెళితే 1000 రూపాయ‌లు సినిమాకు ఖ‌ర్చు అవుతోంది.. ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలో అనేక కంప్లైంట్స్ ఇప్ప‌టికే వ‌చ్చాయి.అందుకే రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో అధిక ధరలకు కళ్లెం పడనుంది… శీతలపానీయాలు, తినుబండారాలు ఇకపై ఎమ్మార్పీ ధరలకే లభ్యం కానున్నాయి. నిబంధనలను అతిక్రమిస్తే యాజమాన్యాలు భారీ మూల్యం చెల్లించుకోనున్నాయి ..

Image result for cinema halls

ఆగస్టు ఒకటి నుంచి సినిమా హాళ్లు, మల్టిప్లెక్సుల్లో మంచి నీళ్లబాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాల విక్రయాలు ఎమ్మార్పీ ప్రకారమే జరుగాలని, ఒక్కపైసా ఎక్కువ వసూలుచేసినా కఠిన చర్యలు తప్పవని తూనికలు, కొలతలశాఖ కంట్రోలర్ అకున్‌సబర్వాల్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఒక్క‌సారిగా సినీ ప్రేక్ష‌కులు ఆనందం వ్య‌క్తంచేశారు.. ఇప్ప‌టికే పార్కింగ్ విష‌యంలో ఫీజ్ వసూలు చేయ‌కూడ‌దు అని చెప్ప‌డంతో, థియేట‌ర్ల‌లో పార్కింగ్ ఫీజు వ‌సూలు చేయ‌డం లేదు. ఇక త‌మ ఆంక్ష‌లు అతిక్ర‌మిస్తే కఠిన శిక్ష‌లు ఉంటాయి అని చెబుతున్నారు.అతిక్ర‌మించిన వారు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. విడిగా విక్రయించే తినుబండారాలు పానీయాల ధర, పరిమాణం వివరాలు స్టిక్కర్ల రూపంలో షాపు ఎదుట కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టంచేశారు. దానిపై ఎంత రేటు ఉంటే అంతే రేటుకు విక్రయించాలని స్పష్టంచేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది డిపార్టమెంట్ .

Image result for canteens in multiplex

దీనిపై ఇప్పటికే ఆయాప్రాంతాల్లోని థియేటర్ యాజమాన్యాలకు అవగాహన కల్పించింది. ఆగస్టు ఒకటి నుంచి కొత్త నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులను కూడా ఆదేశించింది. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సప్ నంబర్ 7330774444 విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలని సూచించారు. ఆగ‌స్టు 2, 3 తేదీల్లో గ్రేటర్ పరిధిలో, 4, 5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.మొదటిసారి కేసు నమోదైతే రూ.25 వేలు, రెండోసారి రూ.50 వేలు, మూడోసారి రూ.1 లక్ష జరిమానాతోపాటు ఆరునెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.