కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా మరొక సినిమా..వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టిన తేజ

263

కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటించిన కవచం చిత్రం మొన్ననే విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది.చిత్రం మంచి విజయం సాధించింది.అయితే వీరు మళ్ళి త్వరలోనే మరొక సినిమాలో జంటగా నటిస్తున్నారు. తేజ దర్శత్వంలో కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు.త్వరలోనే స్టార్ట్ అవ్వనుంది.

Image result for teja kajal bellamkonda srinivas

 

ఈ చిత్రానికి తేజ ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘సీత’ అనే టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ పాత్రకు అనుగుణంగా తేజ ఈ టైటిల్ ని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పాత్ర అద్భుతంగా ఉండబోతోందని సమాచారం. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో కూడా కాజల్ పాత్ర ఎమోషన్ తో కూడుకున్నది.

Image result for teja kajal bellamkonda srinivas

నేనే రాజు నేనే మంత్రి చిత్రం తరువాత తేజ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది.అంతేకాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా జయ జానకి నాయక సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టలేదు.ఈ సినిమాతో అలాంటి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.