అనసూయతో తరుణ్ భాస్కర్ రొమాన్స్….కలిపిన విజయ్ దేవరకొండ!

243

‘పెళ్లిచూపులు’తో మంచి గుర్తింపు తెచ్చుకుని ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’ సినిమాతో విజయ్ దేవరకొండతో పాటు తరుణ్ భాస్కర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే తనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన డైరెక్టర్ రుణం తీర్చుకోవాలని విజయ్ దేవరకొండ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Image result for tarun bhaskar vijay

తరుణ్ భాస్కర్ కోసం నిర్మాత అవతారం ఎత్తుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తరుణ్ భాస్కర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను విజయ్ దేవరకొండ తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో నిర్మించబోతున్నాడంటా.

Image result for tarun bhaskar anasuya

అంతేకాదు, ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన ప్రముఖ యాంకర్, నటి అనసూయ హీరోయిన్ గా నటిస్తుందట. తరుణ్ పక్కన అనసూయ అయితే బాగుంటుందని విజయ్ దేవరకొండే చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకున్న విజయ్.. ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.