కేరళ వరద బాధితులకు విజయ్ భారీ సాయం..!

395

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కేరళ రాష్ట్రం వరదలతో అతలాకుతలమయింది..కేరళ లోని 10 జిల్లాల్లో ప్రజలకు వరద బీభత్సం ఆహారం , నిద్ర లేకుండా చేస్తోంది..ఈ వరదలకుఎన్నో ఇల్లులు నేలమట్టం అవ్వగా దాదాపు 385 మందికి పైగా మరణించారు. తినడానికి తిండి లేక , ఉండడానికి ఇల్లు లేక కేరళ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు అన్ని రంగాల వారు తమకు తోచిన సాయాన్ని అందజేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడు ముందు ఉండే చిత్ర పరిశ్రమ సైతం తమ వంతు సాయం చేస్తూనే ఉంది.

తెలుగు,తమిళ, ,మళయాళ చిత్ర పరిశ్రమ ల నుంచి నటులు సాంకేతిక విభాగాల వారు తమకు తోచిన సహాయం అందిస్తున్నారు..మొదటగా తమిళ లెజెండ్రీ నటుడు కమల్ హసన్ 25 లక్షల రూపాయలు ప్రకటించగా, మరో సినీ నటుడు ఉదయనిది స్టాలిన్ 10 లక్షలు డొనేట్ చేసారు..అయితే తాజా సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో విజయ్ భారీ ఎత్తున 10 కోట్ల రూపాయలు సహాయం చేసినట్టుగా తెలుస్తోంది..కేరళ వరద విపట్టుకు తెలంగాణ ప్రభుత్వం 20 కోట్లు ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ విరాళంగా 10 కోట్లు ప్రకటించారు..జల దిగ్బంధం నుంచి కేరళ వాసులు త్వరగా బయటపడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు..