BREAKING NEWS :హీరో సిద్ధార్థ్‌ భార్య ఆత్మహత్య

489

హీరో సిద్దార్థ్ అనగానే బొమ్మరిల్లు ఫేమ్ సిద్దార్థ్ అనుకోకండి..యాగ వారాయినుమ్‌ నా కాక్క అనే తమిళ సినిమా హీరో సిద్దార్థ్ గురించి చాలా మంద‌కి తెలుసు.. తెలుగువారికి తెలియ‌క‌పోయినా త‌మిళ హీరోగా ఆయ‌న అంద‌రికి సుప‌రిచితులే, కేరళకు చెందిన ఈయన మధుర వాయల్‌ అడయాలం పట్టులోని రెసిడెన్షియల్‌ క్వార్టర్స్‌లోని ఓ ఫ్లాట్‌లో తన భార్య స్మిరిజతో కలిసి నివసిస్తున్నాడు. ఇక వీరిద్దరూ పలు యాడ్స్ లలో నటిస్తూ, ఇంటి దగ్గరే వెడ్డింగ్‌, రిసెప్షన్‌కార్డుల తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారు. గత కొద్దీ రోజులుగా వీరిద్దరూ తరుచు గొడవపడుతున్నారు.వ్యాపార స‌మ‌స్య‌లు అలాగే కుటుంబంలో త‌గాదాల‌తో ఇద్ద‌రూ త‌ర‌చూ గొడ‌వ ప‌డుతున్నారు అని తెలిసింది.

Tamil actor Wife Siddharth Gopinath commits suicide - Sakshi
గ‌త రాత్రి కూడా ఇరువురూ తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు అని చెబుతున్నారు ఇంటి ద‌గ్గ‌ర వ్య‌క్తులు. త‌ర్వా ఇద్ద‌రూ కాసేపు బ‌య‌ట‌కు వెళ్లారు, ఆ తర్వాత హోటల్‌లో భోజనం చేసి ఇంటికి చేరుకున్నారు. ఈ స‌మ‌యంలో ఎవ‌రికి వారు ప‌డుకున్నారు కాని ఇంత‌లోనే ఓ విషాదం జ‌రిగింది. ఉద‌యం లేని సిద్దార్ద్ చూసే స‌రికి స్మిరిజ త‌న గ‌ది నుంచి బ‌య‌ట‌కు రాలేదు. దీంతో అనుమానం వ‌చ్చిన సిద్దార్డ్ చూసేస‌రికి ఒక్క‌సారిగా ఆమె ఉరివేసుకుని క‌నిపించారు… దీంతో వెంట‌నే ఆ విష‌యాన్ని ఇరుకుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌చేశాడు, ఇరుగుపొరుగు వారు వ‌చ్చి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

స్మిరిజ మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సిద్దార్థ్ – స్మిరిజ మధ్య ఎందుకు గొడవలు జరుగుతుండేవి..దీనికి కారణాలు ఏంటి..ఆ గొడవల కారణంగానే ఈమె ఉరి వేసుకుందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. రాత్రి బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యంలో ఎటువంటి వివాదం జ‌రిగింది అనే కోణంలో కూడా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు మొత్తానికి చిన్న చిన్న వివాదాలు ఇలా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునేలా దారితీయ‌డం అంద‌రిని క‌లిచివేస్తోంది. చూశారుగా ఈమె త‌న జీవితం ఎలా అర్దాంత‌రంగా ముగించుకుందో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.