Breaking news: ప్రముఖ నటుడి భార్య ఆత్మహత్య

539

సినీ తారల ఇళ్లలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.మొన్న హరికృష్ణ నిన్న బి.జయ నేడు మరొక నటుడి ఇంట్లో విషాదం.ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఆత్మహత్య చేసుకోడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు కూడా ఒక ప్రముఖ నటుడి భార్య ఆత్మహత్య చేసుకుంది.మరి అతను ఎవరో అతని భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చూద్దామా.వర్తమాన నటుడు సిద్ధార్థ్ గోపినాథ్ సతీమణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. సిద్ధార్థ్ తమిళ చిత్రాల్లో ఇప్పుడిపుడే అవకాశాలు అందుకుం రాణిస్తున్నాడు.సిద్దార్థ్ గోపినాథ్ 2015 లో యాగవరయినుమ్ నా కాక్క అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో హీరో.

భార్య భర్తలిద్దరూ

మలుపు పేరుతో తెలుగులో ఈ చిత్రం విడుదలైంది.గత రాత్రే అతడి ఇంట్లో ఈవిషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానకర పరిస్థితుల్లో మరణించిన అతడి సతీమణి స్మృజ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు.నిన్న సాయంత్రం భార్య భర్తలు ఇద్దరూ బయటకు వెళ్లి వచ్చారు. ఆ తరువాతే ఇంట్లో గొడవ ప్రారంభమైనట్లు ఇరుగు పొరుగువారు చెబుతున్నారు వ్యక్తిగత విషయాలకు సంబంధించి వీరి మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది.తన భార్యతో గొడవ జరగడంతో సిద్దార్థ్ ఇంటి హల్ లో పడుకున్నాడట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

స్మృజ మాత్రం పడక గదిలోనే పడుకుంది. కానీ ఉదయం డోర్ కొట్టిన స్పందన లేకపోవడంతో డోర్ బద్దలు కొట్టి చూస్తే స్మృజ సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించింది.భర్త ఇంట్లో ఉండగానే స్మృజ మరణించడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులు కుటుంబ సభ్యులు, మిత్రులని విచరిస్తున్నారు. స్మృజ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి? వీరి వివాహానికి సంబందించిన వివరాలని పోలీసులు  తెలుసుకుంటున్నారు.చూడాలి మరి ఎలాంటి విషయాలు బయటపడతాయో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక భర్తే చంపి ఆత్మహత్యలాగా క్రియేట్ చేస్తున్నాడా.మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.అలాగే ఆమె ఆత్మకు శాంతి కలగాలని కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.