పెళ్ళికి సిద్దపడ్డ తమన్నా..వరుడు ఎవరో చూడండి..

931

టాలీవుడ్ లో అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన నటి తమన్నాఇండస్ట్రీ కి వచ్చి పదేళ్ళు దాటిన ఇప్పటికి కూడా తన అందంతో మెస్మరైజ్ చేస్తూ అవకాశాలు దక్కించుకుంటుంది.ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి లో కీలక రోల్ చేస్తోంది.అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న F2 మల్టీస్టారర్ మూవీలో విక్టరీ వెంకటేష్ కి జోడీగా నటిస్తోంది. వీటితోపాటు తమిళ్ లో ఒకటి, హిందీలో మరో సినిమాకి ఒకే చెప్పింది.

 

అయితే ఇప్పుడు తమన్నా తన అభిమానులకు బాధ కలిగించే విషయం చెప్పింది.ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత తమన్నా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలిసింది. అందుకు కారణం పెళ్లి. త్వరలోనే తమన్నా పెళ్లిచేసుకోబోతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఆమె పేరెంట్స్ తమన్నాకి సెట్ అయ్యే వ్యక్తిని వెతికి పెట్టారని తెలిసింది. అతడు అమెరికాలో డాక్టర్‌ అంట.అతని ఫ్యామిలీ బాగా సెటిల్ అయిందని సమాచారం.

అక్కడ వారికి చాలా వ్యాపారాలున్నాయని తెలిసింది. ఇరువైపులా పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి నిశ్చితార్ధానికి ముహూర్తాలు చూస్తున్నారని, పెళ్లి కూడా తొందర్లోనే జరుగుతుందంట. అలాగే వివాహం అనంతరం తమన్నా భర్తతో పాటు అమెరికా వెళ్ళిపోతుందని సినీ వర్గాలు తెలిపాయి. అందుకే ఇక నుంచి ఏ కొత్త సినిమాకి తమన్నా సైన్ చేయడం లేదంటా.