గోపీచంద్‌తో రొమాన్స్ కు సిద్ధపడ్డ తమన్నా..?

177

కొంతకాలంగా సరైన విజయాలు లేక డీలా పడ్డ ఈ హీరో గోపీచంద్ తాజాగా మరో సినిమాను పట్టాలెక్కించాడు.తమిళ దర్శకుడు తిరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు.

యాక్షన్‌ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు కొంతమందిని పరిశీలిస్తుండగా తమన్నా అయితే బాగుంటుందని మేకర్స్‌ ఆమెను సంప్రదించారట. తమన్నా కూడా ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది.

Image result for gopichand tamanna movie

ఇటీవలే తమన్నా ఎఫ్2 తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమాలో కూడా గ్లామర్ కాస్త ఎక్కువగానే ఉందంట.మొదటి సారిగా జోడీ కడుతున్న ఈ జంట తెరపై హిట్‌పెయిర్‌గా నిలుస్తారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం ఇండియా పాక్ సరిహద్దుల్లో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తూన్నారు.