‘బాహుబలి 3’ విషయంలో నేను చాలా హ్యాపీ..తమన్నా

513

అందాల తార తమన్నా ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ‘సైరా’ తెరకెక్కుతోంది.దీనిలో ఓ కీలక పాత్రలో తమన్నా నటిస్తోంది.ఇదే కాకుండా ఇంకో రెండు చిత్రాలలో నటిస్తుంది.

Image result for tamanna

అయితే ఈ అమ్మడు ఈ మధ్య ఒక ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఆమె తెలిపింది. బాహుబలి 3 తీయొద్దన్న దర్శక, నిర్మాతల నిర్ణయం కారణంగా తానేమీ అప్‌‌సెట్ కాలేదని వెల్లడించింది. ఎందుకంటే మొదటే ఈ చిత్రబృందం సినిమాను రెండు పార్ట్స్‌తో ముగించేయాలని ఫిక్స్ అయ్యారట.

Image result for tamanna

తమకు అదొక పెద్ద సక్సెస్ సాధిస్తుందని తెలుసని కానీ ప్రేక్షకులు బాహుబలి పార్ట్ 3 తీయాలంటూ డిమాండ్ చేసేంత పెద్ద సక్సెస్‌ను సాధిస్తుందని తాము భావించలేదని తెలిపింది. అయితే మొదట రెండు పార్ట్‌లే తీయాలని తీసుకున్న నిర్ణయానికి చిత్రబృందం కట్టుబడి ఉండటం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని మిల్కీ బ్యూటీ తెలిపింది.