సైరా రివ్యూ వ‌చ్చేసింది అవార్డులే అవార్డులు చిరంజీవి న‌ట‌న సూప‌ర్

537

బాహుబ‌లి త‌ర్వాత అంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసిన చిత్రం అంటే ఇప్పుడు సైరా అనే చెప్పాలి.మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా.. తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు.. చూద్దామా అని మోగాస్టార్ అభిమానులు.. ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా.. మరికొద్ది గంటల్లోనే.. సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొద్ది రోజుల ముందు విడుదలైన ట్రైలర్‌ దుమ్మురేపింది. ఎన్నో అంచనాలను కూడా పెంచేసింది. ‘స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా.. సైరాను’ తీశారు చిరంజీవి యూనిట్. ఈ సినిమా కోసం మెగా అభిమానుల‌తో పాటు ఇటు తెలుగు సినిమా అభిమానులు అంద‌రూ ఎదురుచూస్తున్నారు.

Image result for sye raa

అయితే.. ఈ సందర్భంగా.. యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు సైరా సినిమాపై ఆసక్తికరమై కామెంట్స్ చేశారు. సినిమా చూసిన ఆయన.. అభిమానులతో తన అభిప్రాయలను.. సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా చూస్తున్నంత సేపూ.. రోమాలు నిక్కబొడుచుకున్నాయని.. చిరంజీవి చాలా గ్రేట్‌గా.. కథలో ఇమిడిపోయారని అన్నారు. అసలు నిజంగా.. నేషన్ అవార్డే.. మెగాస్టార్‌ కోసం వెయిట్ చేస్తుందా..అన్నట్టుగా ఆయన జీవించారని చెప్పుకొచ్చారు. ప్రతీ సన్నివేశం.. ఎంతో అద్భుతంగా.. అందరూ చాలా చక్కగా నటించారని అన్నారు. మొదటిసారిగా.. చారిత్రక పాత్రలో నటించిన.. చిరు పేరు.. చరిత్రలో.. నిలిచిపోతుందని.. ఉమైర్ సంధు పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయమని.. సైరా సినిమా.. ఎంతో వీరోచితంగా రూపొందించారని తెలిపారు. ముఖ్యంగా నర్సింహా రెడ్డి ‘వార్’ సన్నివేశాలు ఎంతో అత్యంత్భుతంగా తీశారని కొనియాడారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఈ సినిమా పాత రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంది అని తెలియ‌చేశారు ఆయ‌న‌.. ఇక తాజాగా ఈ సినిమా పై ఎలాంటి అప్ డేట్ వ‌చ్చినా మెగా అభిమానులు సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.. ఇలా ఉమైర్ సంధు ట్వీట్లు చూసి రివ్యూ చూసిన వారు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు, సినిమా హిట్ టాక్ వ‌స్తుంది అని మెగా ఫ్యాన్స్ కూడా సంబ‌రాలు ముందే స్టార్ట్ చేశారు.సురేందర్ రెడ్డి ‘సైరా’ సినిమాను దర్శకత్వం వహించగా.. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. సైరాలో.. లెజండరీ యాక్టర్ అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా తదితరులు నటించారు. ఈ సినిమా అక్టోబ‌ర్ 2 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.