బాహుబలి, సైరా సినిమాల కలెక్షన్స్ లో తేడా ఎంతనో ఇప్పుడు చూద్దాం.

630

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ భారీ అంచనాలతో థియేటర్స్‌లో విడుదలైంది. తొలి స్వాతంత్ర్యపోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించాలన్న మెగాస్టార్ కోరికను తీర్చాడు మెగా ప్రొడ్యుసర్ రామ్ చరణ్ తేజ్. సుమారు రూ. 270 కోట్ల భారీ బడ్జెట్‌లో కొణెదల ప్రొడక్షన్స్‌లో రామ్ చరణ్ నిర్మాతగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా’ చిత్రం నేడు విడుదలై పాజిటివ్ టాక్‌ని రాబట్టింది. బాహుబలి, సాహో చిత్రాల తరువాత టాలీవుడ్ నుండి విడుదలైన ప్యాన్ ఇండియా చిత్ర రిజల్ట్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు. అయితే సినిమా ప్రీమియర్ షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో ఏ సినిమా వచ్చినా… వాళ్ల ముందున్న బాక్సాఫీస్ రికార్డుల కొండ బాహుబలి. మరి సైరా చిత్రానికి బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేసే సత్తా ఉందా? అన్న చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. అయితే తొలిరోజు ఈ రెండు సినిమాల మధ్య కలెక్షన్స్ లో ఎంత తేడా ఉందొ ఇప్పుడు చూద్దాం.

Image result for బాహుబలి, సైరా

2015 జులైలో రిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా బాహుబలి. ఈ సినిమా అప్పటివరకు తెలుగు సినిమా చూడని కలెక్షన్స్ రాబట్టింది. బాహుబలి 1 సినిమా 650 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే బాహుబలి 1 తొలిరోజు 51.1కోట్ల గ్రాస్ ను సాధించి టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 ప్రభాస్ కెరీర్ లో మరొక బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. 2017 ఏప్రిల్ లో విడుదల అయినా ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు కలెక్షన్ల వర్షం అంటే ఎలా ఉంటుందో చూపించింది. ఈ సినిమా ఓవరాలుగా 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపెట్టింది. తొలిరోజు ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాలర్స్ ను కొల్లగొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 121 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాలీవుడ్ సినిమాలకు కూడా చేతకాని వసూళ్లను రాబట్టింది.

ఈ క్రింద వీడియో చూడండి

ఇక తాజాగా అక్టోబర్ 2 న విడుదల అయినా సైరా చిత్రం అద్భుత విజయం సాధించింది. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి చరిత్ర మీద తీసిన ఈ సినిమా మొదటిరోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా మొదటి రోజు 70 కోట్ల రూపాయలను సాధించి మెగాస్టార్ కెరీర్ లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌ను ఏరియాల వారీగా చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో నైజాం రూ. 30 కోట్లు, సీడెడ్ రూ. 20 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 15 కోట్లు, ఈస్ట్ రూ. 10 కోట్లు, వెస్ట్ రూ. 10 కోట్లు, క్రిష్ణా 8. 5 కోట్లు, గుంటూరు-నెల్లూరు కలిపి రూ. 16 కోట్లు‌ మార్కెట్ జరిగింది. అయితే ఓవర్సీస్‌లో కూడా తొలిరోజు దాదాపు రూ. 10 కోట్లు షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన వరల్డ్ వైడ్ తొలిరోజు రూ. 70 కోట్ల షేర్‌తో భారీ కలెక్షన్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 270 కోట్లు. తొలివారంలోనే ఈ బడ్జెట్ మొత్తం నిర్మాతకు వచ్చేస్తుంది. కానీ బాహుబలి రికార్డ్స్ ను క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. మరి బాహుబలి, సైరా కలెక్షన్స్ లో తేడా మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి