సైరా టీజర్..రికార్డులు బ్రేక్ కావడం ఖాయం..టీజర్ లో మీరు ఇవి గమనించారా.?

380

మెగా అభిమానులు మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ రానే వచ్చింది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న ‘సైరా’ మంగళవారం ఉదయం టీజర్ రిలీజైంది. చిరంజీవి మాతృమూర్తి అంజనా మూర్తి చేతులు మీదుగా ఈ టీజర్‌ను విడుదల చేశారు. చిరు బర్త్ డే సందర్భంగా ఒక్క రోజు ముందుగానే విడుదలైన టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. టీజర్ కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సైరా అప్‌డేట్స్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు టీజర్‌ చూసి పండగ చేసుకుంటున్నారు.

అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండబోతోందని సైరా టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. చిరంజీవి కెరీర్లో 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని సురేందర్ రెడ్డి ఒక అద్భుతమైన పీరియడ్ డ్రామాగా, తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేలా తెరకెక్కిస్తున్నారని తేలిపోయింది. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రూ. 150 కోట్ల పై చిలుకు బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, జగపతి బాబు లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ మ్యూజిక్ అందించారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు నటిస్తోండగా ఆయన సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.జెండా పట్టుకొని చిరంజీవి కోట మీద నిలబడి ఉన్న దృశ్యాలు, గుర్రంపై స్వారీ చేసుకుంటూ.. బ్రిటీష్ సైనికులపై కత్తితో చిరు దాడి చేస్తున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ యుద్ధం ఎవరిదీ అనే డైలాగ్.. విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా అన్ని రకాలుగానూ టీజర్ సూపర్‌గా ఉంది.అయితే టీజర్ లో కొన్ని ముఖ్య విషయాలు మీరు గమనించారా..లేదు కదా..

అప్పట్లో బ్రిటిషుల కాలంలో మన ప్రజలను ఎంత నీచంగా చుపెవారో మన అందరికి తెలిసినదే.రాజన్న లాంటి సినిమాలలో వాటిని చక్కగా చూపించారు.ఇప్పుడు ఈ సినిమాలలో కూడా వాటి గురించి చక్కగా చూపించారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.స్వాతంత్రం కోసం పోరాటం చేసిన సైరా నరసింహ రెడ్డి ఎలా ఉంటాడో ఇప్పటికాలం ప్రజలకు చాలా మందికి తెలియదు.కానీ ఈ సినిమాలో చిరంజీవిని చూశాకా భవిష్యత్ తరాలకు చిరంజీవినే సైరా నరసింహ రెడ్డి అన్నట్టు గుర్తుండిపోతాడు.ఇక గెటప్స్ విషయానికి వస్తే ఎక్కడ కూడా ఆ కాలంనాటి గుర్తులు అప్పటి ప్రజలు ఎలా ఉండేవారో స్పష్టంగా చూపించినట్టు తెలుస్తుంది.ఇక టీజర్ చూస్తూనే తండ్రి కోసం కొడుకు రామ్ చరణ్ ఎక్కడ తగ్గినట్టు కనిపించడం లేదు.చాలా డబ్బు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.ఒవరాలుగా టీజర్ చూస్తూనే మెగాస్టార్ మరొక బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయంలా అనిపిస్తుంది.2019 మే నెలలో వేస‌వి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.