సైరా 9 వ రోజు కలెక్షన్స్….

660

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక ఈ సినిమా దూకుడుగా కలెక్షన్స్ రాబడుతోంది. అక్టోబర్ 2 వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. రోజు రోజుకూ సైరా కలెక్షన్ల ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సైరా దూకుడు మామూలుగా లేదు. దసరా సెలవులు కావడం సైరాకు బాగా కలిసొచ్చింది.

Image result for సైరా

విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా తొమ్మిదవ రోజు థియేటర్ల వద్ద కాసుల పంట పండించింది. తెలుగు రాష్ట్రాల థియేటర్లన్నీ మెగా అభిమానులతో కిటకిటలాడాయి. తొమ్మిదవ రోజు ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 185.65 కోట్ల షేర్ రాబట్టింది సైరా నరసింహా రెడ్డి. అన్ని ఏరియాల్లో కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ చిరంజీవి స్టామినా నిరూపించింది. ఉయ్యాలవాడ వీరుడిగా చిరంజీవి నటన చూసి ఫిదా అవుతోంది తెలుగు ప్రేక్షక లోకం. నైజాంలో 41.06 కోట్లు, సీడెడ్ లో 31.08 కోట్లు, నెల్లూరులో 7.12 కోట్లు, కృష్ణాలో 8.90 కోట్లు, గుంటూరులో 11.90 కోట్లు, వెస్ట్ గోదావరిలో 10.09 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 9.95 కోట్లు, ఉత్తరాంధ్రలో 12.98 కోట్లు, మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 185.65 కోట్ల షేర్ రాబట్టి హవా కొనసాగిస్తోంది సైరా నరసింహా రెడ్డి.

ఈ క్రింద వీడియో చూడండి

ఇటు ఇండియాలోనే కాకుండా యూఎస్ లో కూడా సైరా ప్రభావం చూపుతోంది. మొదటి రెండు రోజులకు $1.1 మిలియన్ సాధించిన సైరా తొమ్మిదవ రోజుతో కలుపుకుని 2.70 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. మొదటి ఐదు రోజుల్లోనే 2 మిలియన్ డాలర్లకు చేరుకున్న సైరా, తర్వాత మాత్రం డీలా పడిపోయింది. . యూఎస్ లో లాభాల్లోకి రావాలంటే దాదాపు 3 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది. వీకెండ్, దసరా సెలవులు కూడా కంప్లీట్ అవ్వడంతో సైరా కలెక్షన్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.. వేరే ఏ ఇతర పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ కు ఎలాంటి అడ్డంకి ఉండదు. చూడాలి మరి ముందు ముందు సైరా ఇంకెంత ప్రతాపం చూపెడుతుందో!. మరి సైరా 9 వ రోజు కలెక్షన్స్ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి