అతిలోక సుందరి శ్రీదేవికి స్విట్జర్లాండ్ లో అరుదైన గౌరవం..ఏం చేస్తున్నారో తెలుసా

344

ఇండియన్ సినిమాకు అతిలోక సుందరి అంటే గుర్తుకు వచ్చేది శ్రీదేవి పేరు.ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమెను మర్చిపోవడం ఎవరితరం కావడం లేదు.ఆమె జీవితంలో ఎంతో సాధించింది.భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది.అయితే ఇప్పుడు అతిలోక సుందరి శ్రీదేవికి మరో గౌరవం దక్కబోతోంది.

sridevi కోసం చిత్ర ఫలితం

అది భారత ప్రభుత్వం ఇవ్వబోతున్న బిరుదో, అవార్డో కాదు.వేరే దేశం మన అందాల రాశికి ఇస్తున్న గౌరవం.పర్యాటకులకు స్వర్గధామమైన స్విట్జర్లాండ్ ప్రభుత్వం శ్రీదేవి విగ్రహాన్ని నిర్మించబోతోంది. దిగ్గజ దర్శకుడు యాష్ చోప్రా విగ్రహాన్ని 2016 లో స్విట్జర్లాండ్ లో నిర్మించారు. ఆయన తరువాత ఆ గౌరవం దక్కించుకోబోతోంది శ్రీదేవే కావడం విశేషం.

సంబంధిత చిత్రం

శ్రీదేవి నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ చాందినిని స్విస్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రికరించారు. ఆ చిత్రానికి గుర్తుగా శ్రీదేవి విగ్రహాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.భారతీయ పర్యాటకులని ఆకర్షించేందుకు స్విస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది.