పెళ్లి చేసుకోబోతున్న శ్వేత బసు ప్రసాద్… ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

537

‘కొత్త బంగారు లోకం’ అనే మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు నటి శ్వేతా బసు ప్రసాద్‌. ఎక్కడా అనే డైలాగ్ తో కుర్రకారును తన వెంట తిప్పేలా చేసుకుంది.ఆ తర్వాత రైడ్ రైడ్, కల్వర్, కింగ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించి తెరమరుగైంది. ‘మక్డే’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు.. పలు హిందీ చిత్రాలతో పాటు.. తెలుగు, తమిళ భాషల్లో నటించింది.ఆ తర్వాత ఈ భామ తర్వాత పూర్తిగా ముంబైకే పరిమితమయ్యారు. ప్రస్తుతం పలు టీవీ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్వేతా బసు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.Image result for swetha basu prasad

శ్వేత బసు ప్రసాద్ గురించి మన అందరికి తెలిసిందే. తన నటనతో మన అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమా ఛాన్స్ లు తగ్గి వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. ఆ తర్వాత ఆ కేసు నుంచి బయటపడి మళ్ళి సినిమా ప్రయత్నాలు చేసింది. అయినా కానీ ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.దాంతో అమ్మడు మనసు పెళ్లి మీదకు మళ్లింది.ఫిల్మ్‌మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ను శ్వేతా వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబరు 13న పుణెలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత అదే వారంలో ముంబయిలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మార్వాడీ, బెంగాలీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్వేత తన కాబోయే భర్త, స్నేహితులతో కలిసి ఇండోనేషియా, బాలీలో బ్యాచిలర్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలు, వీడియోలను శ్వేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ విషయం గురించి శ్వేతా స్నేహితురాలు మాట్లాడుతూ.. శ్వేతా, రోహిత్‌లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్లుగా వారు రిలేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఇద్దరూ బెస్ట్‌ కపూల్స్‌ మారబోతున్నారు. ఈ క్షణాల కోసం మేమంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక అబ్బాయిలే ముందు ప్రపోజ్‌ చేయాలనేది పాత మాట. ఇద్దరి మధ్య ఒకే రకమైన భావాలు ఉన్నప్పుడు ఎవరు ముందు ప్రపోజ్‌ చేశారనేది ముఖ్యం కాదు. శ్వేతానే ముందుగా ప్రపోజ్‌ చేసింది. గోవా వెళ్లినప్పుడు శ్వేత, రోహిత్‌కు ప్రపోజ్‌ చేసింది. తర్వాత రోహిత్‌ పూణెలో ఎస్‌ చెప్పాడు అంటూ చెప్పుకొచ్చారు.త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వీరికి మా ఛానెల్ తరుపున బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. మీరు కూడా కామెంట్ రూపంలో ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేయండి. మరి శ్వేత బసు ప్రసాద్ గురించి అలాగే ఆమె చేసుకోబోతున్న పెళ్లి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.