సూర్య -విజయ్ దేవరకొండ హీరోలుగా భారీ మల్టీస్టారర్?

309

సౌత్ స్టార్ సూర్య, టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా రాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు.ప్రస్తుతం ఈ ఇద్దరు ఎవరి సినిమా పనుల్లో వారు ఉన్నారు.ఆ సినిమాలు అయిపోయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుందంట.

Image result for surya vijay devarakonda

ఈ సినిమాను ‘గురు’ ఫేం సుధా కొంగర దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది.కె.ఇ.జ్ఞానవేల్ రాజాకు చెందిన స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించబోయే సినిమా చేయబోతున్నారని, 2019లో ఈ సినిమా మొదలు కాబోతోందని కొన్ని రోజులుగా తమిళ సినీ వర్గాల్లో టాక్.

Image result for surya vijay devarakonda

ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో ద్విబాషా చిత్రంగా ప్లాన్ చేస్తున్నారని, అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉందని, అఫీషియల్ సమాచారం రావడానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారు.విజయ్ నటించిన నోటా విడుదలకు సిద్దమవుతుంది.ఈ సినిమా తమిళ్ తెలుగు లో విడుదల అవుతుంది.