కేరళ వరద బాధితుల కోసం కమల్, సూర్య, కార్తి, విజయ్ దేవరకొండ విరాళం..

384

భారీ వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ ప్రజల కోసం పలువురు సినీ స్టార్లు తమ వంతు సహాయం అందించారు. కమల్ హాసన్, సూర్య, విజయ్ దేవరకొండ, కార్తి తదితరులు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. హీరో విశాల్‌ ‘కేరళ రెస్క్యూ’ పేరుతో అత్యవసర వస్తువులను సేకరించి బాధితులకు అందించే ప్రయత్నంలో ఉన్నారు.

Image result for surya karthi kamal

దీనిపై స్పందించిన కమల్ హాసన్ రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. తమిళ స్టార్లు సూర్య, కార్తి కలిసి రూ. 25 లక్షలు ప్రకటించారు. తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ తన వంతుగా రూ. 5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా ముందుకు రావాలన్నారు.దీని గురించి విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.

‘విహారయాత్రకు వెళ్లాలంటే కేరళ నా ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఎంతో మంది మంచి మనుషులను కలిశాను. వారిని పర్సనల్‌గా ఎలా రీచ్ కావాలో అర్థం కావడం లేదు. రౌడీస్‌ మీకు తోచిన చిన్న సహాయం చేయండి, అది కేరళలోని మనలాంటి కొందరి జీవితాల్లో పెద్ద మార్పునకు కారణం అవుతుంది. నేను రూ.5 లక్షలతో దీన్ని ప్రారంభించా’ అని విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశారు.