సైరా నుంచి చ‌ర‌ణ్ ని తీసేశారు పెద్ద సీక్రెట్ చెప్పిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి

196

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా చిత్రం సూప‌ర్ స‌క్స‌స్ అయింది.. రెండు షోలు విడుద‌ల అయి సూప‌ర్ స‌క్సస్ భారీ హిట్ టాక సంపాదించుకుంది, సినిమాలో చిరంజీవి ఆ రోల్ ని అంద‌రూ గుర్తు తెచ్చుకుంటున్నారు, ఓ గొప్ప యోధుడిలా చిరంజీవి కనిపించారు అని అంద‌రూ ప్ర‌శంస‌లు ఇస్తున్నారు.

Image result for ram charan and chiru sye raa

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో అమితాబ్-సుదీప్-సేతుపతి లాంటి స్టార్లు నటించారు. ఒక్కో భాష నుంచి ఒక్కో స్టార్ ని ఈ చిత్రంలో భాగం చేశారు. అయితే వీళ్లతో పాటు ఇదే చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించాల్సింది. చెర్రీ కోసం ప్రత్యేకించి సురేందర్ రెడ్డి ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ని అనుకున్నారు. అయితే ఆ పాత్ర ఏమైంది? అంటే…

Image result for ram charan and chiru sye raa

అసలు చరణ్ పాత్రను యథాతథంగా చిత్రీకరిస్తే సినిమాలో సగభాగం అదే ఆక్రమిస్తుందన్న షాకింగ్ నిజాన్ని సురేందర్ రెడ్డి వెల్లడించడం షాకిస్తోంది. ఆయ‌న తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సైరా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. చరణ్ కోసం సినిమాలో ఓ పాత్రను అనుకున్నాం. కానీ సినిమా నిడివి పెరుగుతుందని ఆ పాత్రను అసలు చిత్రీకరించలేదు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాని బయోపిక్ కేటగిరీ అని అనలేను.. అని తెలిపారు.

Related image

రచయితల బృందంతో ప్రతిదీ చర్చించేప్పుడు మెగాస్టార్ చిరంజీవి అనుభవం ఎంతో లాభించిందని సురేందర్ రెడ్డి వెల్లడించారు. చిరు సహా రచయితలు అంతా చర్చించాకే చరణ్ పాత్రను వద్దనుకున్నారని అతడు చెప్పిన దానిని బట్టి అర్థమవుతోంది. ఒకవేళ చరణ్ పాత్ర ఇందులో ఉండి ఉంటే బహుశా అది ఇతర పాత్రల్ని డామినేట్ చేయడం ద్వారా సినిమా సోల్ ని దెబ్బ కొట్టి ఉండేదేమో అంటూ విశ్లేషిస్తున్నారు కొందరు. అందుకే సైరా నుంచి చరణ్ ని ఎలిమినేట్ చేశారు. అయితే అతడు నటుడిగా ఎలిమినేట్ అయినా నిర్మాతగా మాతృం కీలక భూమికను పోషించారన్నమాట.

ఈ క్రింద వీడియో చూడండి

అలాగే సైరా విషయంలో అమితాబ్ బచ్చన్.. చిరంజీవి దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లారట. అందుకే ఆ ఇద్దరూ మెగాస్టార్లు అయ్యారు అని సూరి తెలిపారు. ఒక వీరుడి కథ చెబుతున్నాం. ఇంతమంది స్టార్స్ ఉన్నారు కాబట్టి జాత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేశానని .. ఆరంభం స్క్రిప్టు కోసమే ఎక్కువ మదన పడ్డానని తెలిపారు. ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డా సంవ‌త్స‌రం పైనే స్క్రిప్ట్ వ‌ర్క్ చేశాం అందుకే ఈ సినిమా ఇంత స‌క్స‌స్ అయింది అని ఆయ‌న తెలియ‌చేశారు. మొత్తానికి ఈ సినిమా చ‌ర‌ణ్ కూడా ఓ మంచి క్యారెక్ట‌ర్ చేసి ఉంటే బాగుండేది అని చాలా మంది మెగా ఫ్యాన్స్ అంటున్నారు.