సైరా సినిమాపై షాకింగ్ కామెంట్ చేసిన చిరు భార్య సురేఖ‌

208

టాలీవుడ్ కి మెగాస్టార్ అయిన చిరంజీవి నటించిన‌ సినిమా సైరా నరసింహ రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది, వ‌ర‌ల్డ్ వైడ్ పాజిటీవ్ టాక్ తో సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. . చిరంజీవి సినిమా హిట్ అవ్వ‌డంతో ఎంతో ఆనందంలో ఉన్నారు, త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ , నిర్మాత‌గా మంచి స‌క్స‌స్ సాధించారు అని మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంలో ఉంది, దాదాపు ఎవ‌రూ ఇంత బ‌డ్జెట్ తో పెట్టుబ‌డికి సాహ‌సించ‌లేదు, కాని చ‌ర‌ణ్ మాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా పెట్టుబ‌డి పెట్టి ఈ సినిమా నిర్మించారు.

Image result for chiru wife

ఈ సినిమా విషయంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఫుల్ ఖుషిగా ఉంది.. విడుద‌ల‌కు ముందే వారు స‌క్స‌స్ అవుతుంది అని సంతోషంలోనే ఉన్నారు, పైగా మెగా కుటుంబంలో కొంద‌రు ఈసినిమాలో న‌టించ‌డంతో వారి న‌ట‌న వారి వ‌ర్క్ అన్నీ కూడా మెగా అభిమానుల‌కు న‌చ్చాయి. సినిమాలో చిరంజీవి నటించటం, చిత్రం రామ్ చరణ్ నిర్మించటం, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై సురేఖ కొణిదెల సమర్పించటం, ఇదంతా మెగా అభిమానుల‌కు ఎంత‌గానో న‌చ్చింది. ఇక తాజాగా చిరంజీవి కూడా ఈ విష‌యం పై మాట్లాడారు.ఈ రోజు ఉదయం సురేఖ నాతో మాట్లాడుతూ మనం డబ్బుల గురించి చూడకూడదు. డబ్బు వస్తుందో రాదో తెలియదు కానీ లైఫ్ టైమ్ లో మీకు గొప్ప పాత్ర ఇది.

ఈ క్రింద వీడియో చూడండి

ఆ తృప్తిని డబ్బుతో కొలవలేము. మీ కోరిక తీర్చాలని రామ్ చరణ్ ఈ సినిమా చేశాడు. ఆ విధంగా వాడు సంతృప్తిగా ఉంటాడు. గొప్ప పాత్ర చేశాను అనే మీ కోరిక నెరవేరింది. నేను మీతో సినిమా చేయాలనే నా కోరిక నెరవేరిందంటూ చెప్పిందని చిరు చెప్పుకొచ్చాడు.సో ఈ సినిమా తీసిన స‌మ‌యం నుంచి డ‌బ్బు వ‌సూళ్లు గురించి చిరంజీవి ఫ్యామిలీ ఆలోచించ‌లేదు, చిరంజీవి కోరిక తీర్చేందుకు చ‌ర‌ణ్ పెద్ద సాహ‌సం చేశారు అని అంటున్నారు అంద‌రూ.. సో చ‌ర‌ణ్ తాజాగా ఈ సినిమా స‌క్స‌స్ ని ఎంజాయ్ చేస్తున్నారు…ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగువారు అంద‌రూ కూడా మెగా ట్వీట్లు పెడుతూ సోష‌ల్ మీడియాలో అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నారు, మెగాస్టార్ కోరిక త‌న వార‌సుడు తీర్చాడు అని సినిమా ఇండ‌స్ట్రీలో ప‌లువురు శ‌భాష్ అంటున్నారు.