పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రియ..

506

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ సరసన అరంగేట్రం చేసిన సుప్రియ యార్లగడ్డ మళ్ళీ కనిపించలేదు…దాదాపు 20 సంవత్సరాలు తరువాత గూడచారి సినిమాలో కీలక పాత్ర పోషించింది..ఈ రీ ఎంట్రీ లో సుప్రియ నదియా ఖురేషీ పాత్రను పోషించింది..రా ఏజెన్సీ కి చెందిన త్రినేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీకి వర్క్ చేసే మిస్టీరియస్ ఏజెంట్ గా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..

ప్రస్తుతం ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మొదటి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాన్నీ పంచుకుంది. నేను సినిమాలు చేయటం మానేసి దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పటికీ నన్ను పవన్‌కల్యాణ్‌ హీరోయిన్‌ గానే గుర్తుంచుకున్నారు. అందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకంటూ సొంతంగా గుర్తింపు రాదా అనుకుంటుంటాను.. అని తెలుపుతూ నిజంగా పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి వస్తారని ఇంత పెద్ద స్టార్ అవుతారని నేను అస్సలు ఊహించలేదని తెలిపింది.