సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు ప్రభాస్ మల్టీ స్టారర్..

382

టాలివుడ్ లో మల్టి స్టారర్ సినిమాల హడావుడి మొదలైంది..టాలివుడ్ జక్కన్న ఎన్టీఆర్ చరణ్ లతో మల్టి స్టారర్ మోవీ త్వరలో ప్రారంబిస్తుండగా ఇప్పుడు మరో మల్టీ స్టారర్ షూటింగ్ ను శరవేగంగా పూర్తీ చేసుకుంటుంది..మహేష్ బాబు అల్లరి నరేష్ స్నేహితులుగా నటిస్తున్న మహర్షి త్వరలో విడుదలకు సిద్దమవుతోంది..ఈ చిత్రంలో మహేష్ – నరేష్ స్నేహితులుగా కనిపిస్తారని – కుచేలుడు- శ్రీకృష్ణుడు తరహా స్నేహమిదని ప్రచారం సాగుతోంది. మహేష్ కాలేజ్ విద్యార్థిగా – రైతుగా కనిపించి సర్ ప్రైజ్ చేయనున్నాడన్న సంగతి ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఈ సినిమా తర్వాత మహేష్ నటించే 26వ సినిమాలోనూ అంతకుమించిన సర్ ప్రైజ్ ఉంటుందిట. మహేష్ – సుకుమార్ సినిమాలో 25 నిమిషాల పాత్ర వేరొక స్టార్ హీరో కోసం సిద్ధమవుతోందిట. ప్రభాస్ ని ఆ పాత్రకు ఒప్పించాలని సుకుమార్ భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కి కుదరని పక్షంలో చరణ్ – ఎన్టీఆర్ లో ఎవరో ఒకరిని సుకుమార్ ఒప్పిస్తాడట. ఈ పాత్ర కథలో కీలక మలుపు నిచ్చే విధంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు వేగంగానే సాగుతున్నాయ్. 25వ సినిమా మహర్షి పూర్తవ్వగానే 26వ సినిమా సన్నాహాలు చేయనున్నారని తెలుస్తోంది. 1-నేనొక్కడినే ఫ్లాప్ కావడంతో సుకుమార్ ఈసారి కథ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. `రంగస్థలం` తరహాలో బ్లాక్ బస్టర్ ని మహేష్కి ఇవ్వాలన్న తాపత్రయం సుక్కూలో కనిపిస్తోందని సన్నిహితులు చెబుతున్నారు.