అరుదైన గౌరవం దక్కించుకున్న సన్నీ లియోన్

371

మత్తెక్కించే అందాలతో కుర్రకారు మతులుపోగొట్టే సన్నీ లియోన్ తనదైన ప్రత్యేకతలతో తరచూ వార్తల్లో నిలిచే సంగతి తెలిసిందే.ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికులు సెర్చ్ చేసిన వ్యక్తిగా రికార్డుకెక్కింది సన్నీ లియోన్.పోర్న్ ను వదిలేసి బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.సౌత్ ఇండియాలో కూడా కొన్ని సినిమాలలో నటించింది ఇంకా కొన్ని అవకాశాలను దక్కించుకుంటుంది.

Image result for sunny leone

తాజాగా ఈ మాజీ పోర్న్ స్టార్ కుఅరుదైన గౌరవం లభించింది. ప్రసిద్ధ మ్యూజియం మేడం టుసాడ్స్ తన అమ్ములపొదిలో సన్నీలియోన్ మైనపు బొమ్మను చేర్చింది.ఈ మ్యూజియంలో అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, షారుక్‌ ఖాన్‌ తదితరుల విగ్రహాలను పెట్టారు.ఇప్పుడు వీరి సరసన ఇప్పుడు సన్నీ చేరింది. సన్నీ తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకోవడం మరో విశేషం. ఆ వివరాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

Image result for sunny leone delhi lussad

ప్రసిద్ధమైన మేడం టుసాడ్ మ్యూజియంలో తన బొమ్మను తానే చూసుకోవడం అద్భుతుమైన అనుభూతిని కలిగించిందని సన్నీ ఆనందం వ్యక్తం చేసింది. సన్నీ భర్త డేనియల్ వెబర్ కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.ఆ వీడియోను చాలా మంది చూస్తూ లైక్స్ కొడుతున్నారు.