మళ్లీ అప్పటిలా అవ్వాలా అంటూ బాధ పడుతున్న సునీల్

425

తెలుగు సినీ పరిశ్రమలో కమెడీయన్ నుంచి హీరో అయినా వాళ్ళలో సునీల్ ఒకరు.హీరోగా మారిన సునీల్ ను జనాలు ఆదరించలేకపోయారు. హీరోగా సునీల్ చేసిన సినిమాలు కొన్ని హిట్టయినా ఆ తరువాత ఛాన్సులు లేకుండా పోయాయి.అందుకే మళ్ళి కమెడియన్‌గానే సెటిలవ్వాలన్న నిర్ణయానికి వచ్చేశాడు సునీల్.దీంతో సునీల్‌కు అవకాశాలు తన్నుకొస్తున్నాయట.

అల్లరి నరేష్‌ నటిస్తున్న సినిమాలో సునీల్‌కు సెకండ్ ఇన్సింగ్స్ కమెడియన్‌గా అవకాశం వస్తోందట. అలాగే దర్శకుడు శ్రీను వైట్ల నిర్మిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలోను, త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్న అరవిందసమేత సినిమాలో అవకాశాలు వచ్చాయట. గతంలోలా హీరోగా 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కాకుండా కేవలం కోటి రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్‌ను సునీల్ తీసుకుంటున్నారట.

అయితే హీరోగా కాకుండా కమెడియన్‌గా నటించడానికి సునీల్‌కు సిక్స్ ప్యాక్ అడ్డొస్తోంది. గతంలో లాగా పొట్ట ముందుకు వేసుకుని కమెడియన్‌గా కనిపించాల్సి అవసరం వచ్చింది. దీంతో సునీల్ మళ్ళీ తిరిగి అలా అవ్వాలా అంటూ కన్నీరుమున్నీరు అవుతున్నాడట.పొట్ట పెంచడం కోసం రకరకాల ఆహరపదార్థాలు తిని కొవ్వును పెంచే పనిలో ఉన్నాడంట.మరి కమెడియన్ గా పూర్వ వైభవం సంపదిస్తాడో లేదో చూడాలి.