సొంత బేనర్ పెట్టేసిన యంగ్ హీరో సందీప్ కిషన్..

295

యువ హీరోల్లో అసలు ఏమాత్రం లక్ కలిసి రాని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సందీప్ కిషన్ అని చెప్పొచ్చు. సినిమాలైతే చేస్తున్నాడు కాని వాటికి తగిన ఫలితాలను రాబట్టడంలో మాత్రం వెనుకపడ్డాడు సందీప్ కిషన్. అందుకే మరో అడుగు ముందుకేసి నిర్మాతగా కూడా మారి మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పలువురు తెలుగు స్టార్స్ తమకంటూ సొంత సినీ నిర్మాణ సంస్థలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Image result for sundeep kishan

రామ్ చరణ్, మహేష్ బాబు, సుధీర్ బాబు ఇలా పలువురు స్టార్స్ సొంతగా సినీ నిర్మాణ సంస్థలు పెట్టుకోగా… తాజాగా ఈ లిస్టులో సందీప్ కిషన్ కూడా చేరారు. ‘వెంకటాద్రి టాకీస్’ పేరుతో ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించినట్లు తెలుస్తోంది. తన కెరీర్లో తొలి హిట్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’…. ఈ సినిమా గుర్తొచ్చేలా ‘వెంకటాద్రి టాకీస్’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ బేనర్లో సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా సైతం రూపొందుతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు.అన్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సందీప్ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని #NVNN పేరుతో పిలుస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు పూర్తి టైటిల్ రివీల్ కానుంది.చూడాలి మరి ఈ సొంత ప్రయత్నం ఏమేరకు మంచి ఫలితాన్ని ఇస్తుందో.