ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని పాత్రలో సుమంత్..చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన..

434

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా యన్.టి.ఆర్.తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం భారీ అంచనాలున్న సినిమాల్లో ‘యన్.టి.ఆర్’ ఒకటి. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని పాత్రల ఎంపికను చాలా జాగ్రత్తగా చేపడుతున్నారు.చాలా మంది ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు.విద్యాబాలన్ కైకాల సత్యనారాయణ రానా లాంటి నటులు నటిస్తున్నారు.

అయితే ఇందులో అక్కినేని నాగేశ్వర రావు పాత్రను ఎవరు చేస్తారా అని అభిమానులు ఎంతో ఎదురుచూశారు.ఇక ఎన్టీఆర్‌తో పాటు సినీ ఇండస్ట్రీని ఏలిన అక్కినేని నాగేశ్వరరావు పాత్ర ఈ సినిమాలో కీలకం కానుండగా ఈ పాత్రలో నటిస్తున్నట్టు శనివారం నాడు అధికారికంగా ప్రకటించారు ఏఎన్నార్ మనవడు సుమంత్.

‘మా తాత గారి పాత్రలో నటించడం నా అదృష్టం. ఇంత గొప్ప సినిమాలో నేను భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన ఇచ్చారు సుమంత్.ఎవరు చేస్తారా ఎవరు చేస్తారా అని ఎదురు చుసిన అభిమానులకు ఇక అక్కినేని మనువడే చెయ్యడం ఆనందాన్ని ఇస్తుంది.