స్టార్ మహిళ ఆపేయడం వెనుక ఉన్న అసలు నిజాలు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న సుమ

446

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ ఎవరంటే సుమ అని ఠక్కున చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత రెండు దశాబ్దాలుగా టెలివిజన్, సినిమా రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. ఇప్పటికీ యువ యాంకర్లకు ధీటుగా తన ప్రతిభను చాటుకొంటున్నారు. సినిమా ఫంక్షన్లు, ప్రైవేట్ ఫంక్షన్లు అనే తేడా లేకుండా మాటలతో అదరగొట్టేస్తుంటారు. తాజాగా ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ టెలివిజన్ షో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది.స్టార్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే స్టార్ మహిళ కార్యక్రమానికి సుమ ఏకైక యాంకర్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుమ యాంకరింగ్‌ ప్రతిభను గొప్పగా చెప్పుకొంటారు. స్టార్ మహిళ కార్యక్రమం దేశంలోనే అతి సుదీర్ఘంగా సాగుతున్న కార్యక్రమంగా రికార్డుకెక్కింది. 2008 ఆగస్టు 9న ఈ కార్యక్రమం ఇటీవలే ముగిసింది. ఇది టెలివిజన్ రంగంలో ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

స్టార్ మహిళ కార్యక్రమం ప్రస్తుతం 3 వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకొన్నది. ఒకే కార్యక్రమం ఇన్ని ఎపిసోడ్స్‌గా కొనసాగడం నిజంగా అభినందనీయం. ఈ షోకు మంచి రేటింగ్‌ రావడానికి సుమ యాంకరింగ్ కూడా ఓ ప్రత్యేక కారణంగా చెప్పుకొంటారు.ఇటీవలే 3 వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది స్టార్ మహిళ. ఇన్నేళ్లు ఇన్ని వేల ఎపిసోడ్స్ చేసిన షో ఇండియాలోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది స్టార్ మహిళ. ఈ షో ద్వారా సుమ ఇప్పటికే లిమ్కా బుక్ రికార్డ్ లో చేరింది. ముగింపు కార్యక్రమంలో యాజమాన్యంతో పాటు సుమ తల్లి కూడా హాజరయ్యారు. ఆమె కూడా సుమ మీద ప్రశంసలు కురిపించారు. ఇక స్టార్ మహిళ గురించి సుమ మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు చిన్నగా ఉన్నప్పుడు కూతురు ఒకటిన్నర సంవత్సరం ఉన్నప్పుడు ఈ పోగ్రామ్ స్టార్ట్ చేశాం ఇప్పటికి 12 ఏళ్ళు పూర్తీ చేసుకుందని ఇన్నేళ్లు చేస్తానని తానూ కూడా అనుకోలేదని చెప్పుకొచ్చింది. స్టార్ మహిళను లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేనని అంతలా నా జీవితంలో స్టార్ మహిళ ముడిపడి ఉందని చెప్పింది.

Image result for suma

ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో సభ్యురాలిగా మారిపోయానని అంతలా పేరు తెచ్చిన స్టార్ మహిళను కొన్ని కారణాల వలన ఆపేయాలని అనుకున్నానని సుమ చెప్పింది. కొన్ని రోజులు విరామం తీసుకుని ఈ పోగ్రామ్ ను మళ్ళి స్టార్ట్ చేసే ఆలోచన ఉందని చెప్పింది. ప్రస్తుతం ఈ పోగ్రామ్ తెరపడుతున్నందుకు బాధగా ఉందని చెప్పింది. మా అత్తగారు చివరి రోజు వరకు ఈ పోగ్రామ్ చూసి ఆనందించారని కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తానికి సుమ స్టార్ మహిళ పోగ్రామ్ కు ముగింపు పలికింది. అలాగే సుమ మనసుకు హత్తుకునే మాటలు ఎంతోమందికి గుండెను బరువెక్కించింది. కొన్నాళ్లుగా ఈ పోగ్రామ్ తో సుమకు అలవాటు పడ్డ ప్రేక్షకులు మరేదైనా కొత్త పోగ్రామ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. చూడాలి మరి సుమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. సుమ గురించి స్టార్ మహిళా పోగ్రామ్ గురించి ముగింపు కార్యక్రమంలో సుమ చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.