షాకింగ్ న్యూస్: ప్రముఖ నటి హోటల్ గదిలో ఆత్మహత్య..

485

సినిమా ఇండస్ట్రీని మరణాలు వీడడం లేదు.మొన్న హరికృష్ణ నిన్న జయ ఇప్పుడు మరొకరు.ఒకరి తరవాత ఒకరు చనిపోతున్నారు.కొందరు యాక్సిడెంట్ అయ్యి చనిపోతే కొందరు ఆరోగ్యం బాగాలేక చనిపోతున్నారు.మరికొందరు అనుమానాస్పదంగా చనిపోతున్నారు.ఇప్పుడు మరొక నటి చనిపోయింది.మరి ఆమె ఎవరు ఎలా చనిపోయిందో చూద్దామా.

Image result for పాయల్ చక్రవర్తి

పాయల్ చక్రవర్తి ప్రముఖ నటిగా బెంగాలీ చిత్రాలు, సీరియల్స్ లో నటిస్తోంది. పాయల్ చక్రవర్తి తాజగా హోటల్ గదిలో మరణించిన వార్త సంచలనంగా మారింది. అనుమానాస్పద పరిస్థితితుల నడుమ ఆమె శవమై కనిపించింది.వెస్ట్ బెంగాల్ లోని సిలిగురి నగరంలోని ఒక హోటల్ లో ఆమె చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల పాయల్ తన భర్త నుంచి విడిపోయినట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకుని భర్త నుంచి కొంత కాలంగా పాయల్ దూరంగా ఉంటోంది. 36 ఏళ్ల పాయల్ కు చిన్నారి బాబు కూడా ఉన్నాడు.

Image result for పాయల్ చక్రవర్తి

తన కొడుకుతో కలసి పాయల్ తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు తెలుస్తోంది.బుధవారం రోజు ఓ హోటల్ గదిలో పాయల్ బస చేసినట్లు తెలుస్తోంది.హోటల్ సిబ్బంది కొంత సేపు గది తలుపులు కొట్టినా ఆమె స్పందించలేదు. దీనితో తలుపులు పగలగొట్టారు.పాయల్ చక్రవర్తి అనుమానాస్పద కరంగా మరణించి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.పాయల్ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతికి సంబందించిన వివరాలు ఆరా తీస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆమె మృత దేహాన్ని పోస్ట్ మార్టం కొరకు పంపారు.పాయల్ మృతితో ఆమె సహచర నటులు విషాదంలో ఉన్నారు. పాయల్ మృతికి సంబందించిన కారణాలని పోలీసులు వారిని అడిగి కూడా తెలుసుకోనున్నారు. పాయల్ అసలు ఆ హోటల్ గదికి ఎందుకు వెళ్లిందో ఇప్పటికి తెలియలేదు. పోలీసులు ప్రాధమికంగా మాత్రం ఇది ఆత్మహత్యే అని అనుమానిస్తున్నారు.చూడాలి మరి పోలీసుల విచారణలో ఏం తేలుతుందో.మరి ఈ నటి మరణం గురించి మీరేమంటారు.ఆమె ఆత్మహత్య చేసుకుండా..ఎందుకు చేసుకుందని అనుకుంటున్నారు.మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.అలాగే ఆమె మృతికి కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.