పొట్టి నరేష్ మీద జరిగిన దాడి విషయంలో స్పందించిన సుదీర్ రష్మీ.. ఏమన్నారో తెలిస్తే షాక్..

459

జబర్దస్త్ పోగ్రామ్ ద్వారా ఫెమస్ అయినా వాళ్లలో పొట్టి నరేష్ ఒకరు. వయసు 20కి దగర్లో ఉన్నా జన్యు లోపంతో ఐదేళ్ల బాలుడిగా కనిపిస్తుంటాడు నరేష్. తన లోపానికి కుంగిపోకుండా జబర్దస్త్ ద్వారా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని దూసుకుపోతున్నాడు.అయితే ఇప్పుడు నరేష్ మీద దాడి జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే.

Related image

శ్రీకాకుళం పట్టణంలో కళింగాంధ్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం రాత్రి జబర్దస్త్ ఫేం నరేష్ తన టీమ్‌తో ప్రదర్శన ఇచ్చాడు. ఈ సందర్భంగా కొందరు యువకులు గ్రీన్ రూమ్‌లోకి తొంగి చూసేందుకు ప్రయత్నించగా బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువకులు బౌన్సర్లతో వాగ్వాదానికి దిగారు. నిర్వాహకులు కలగజేసుకోవడంతో వివాదం సమసింది. ఆ తర్వాత నరేష్ టీమ్ ప్రదర్శన ఇచ్చి తిరిగి పయనమైంది. అయితే గొడవను మరిచిపోని ఆ యువకులు నరేష్ టీమ్ ప్రయాణిస్తున్న కారుపై చిన్న బరాటం వీధికి రాగానే రాళ్లు విసిరి పరారయ్యారు. ఈ దాడిలో కారు అద్దాలు పగిలాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు స్థానికులు ఆ యువకులను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకడు చిక్కాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం అధారంగా మిగిలిన వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మీరు చూడటానికి వచ్చారు. చూడాలి. వాళ్ళు రావడం లేట్ అయితే వెయిట్ చెయ్యాలి. వాళ్ళు వచ్చాకా చూసి వెళ్ళిపోవాలి. అంతేకాని ఒక వ్యక్తి అభిమాని అని చెప్పుకుని వారి మీద దాడి చెయ్యడం ఎంతవరకు కరెక్ట్. మీరు వచ్చింది ఫ్యాషన్ కోసమా..లేక వారు ఎలా ఉంటారు వారిని ఏమైనా చేద్దామని వచ్చారా. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని సుదీర్ స్పందించాడు. ఇది కేవలం నరేష్ కు మాత్రమే కాదు చాలా మంది సెలెబ్రెటీలకు జరుగుతుంది.దీని మీద రష్మీ స్పందిస్తూ…. సెలెబ్రిటీల కోసం వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కలుస్తారు. అంతేకాని వారు రావడం లేట్ అవుతుందని వాళ్ళ మీద దాడి చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇలాంటి పరిస్థితి నేను కూడా ఎదుర్కొన్నా. అమ్మాయిని అని కూడా చూడకుండా మీద వచ్చి పడతారు. జనాల మైండ్ మారాలి అని రష్మీ స్పందించింది. మరి నరేష్ మీద జరిగిన దాడి గురించి అలాగే సుదీర్ రష్మీ స్పందించి అన్నమాటల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.