ప్రేమికుల రోజున సుధీర్ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టిన రష్మీ

378

బుల్లితెరపై మంచి జోడి ఎవరని ఎవరినైనా అడిగితే అందరి నోటా వచ్చే జంట పేర్లు సుదీర్ రష్మీ.రష్మీ మొదట చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికి ఆ తర్వాత జబర్ధస్త్ షోలో యాంకర్ గా చేసి.. బాగా క్రేజ్ సంపాధించుకుంది. ఆ క్రేజ్ తోనే ఆమె సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది. నటిగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంది.అలాగే జబర్దస్త్ అనే పోగ్రామ్ వలన బాగా పాపులర్ అయినా వ్యక్తి సుదీర్.వీళ్లిద్దరు విడివిడిగా ఉన్నప్పటి కంటే కలిసున్నప్పుడే బాగా ఫెమస్ అయ్యారు.వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అనే స్టేజ్ కు జనాలను తీసుకొచ్చారు.అయితే అలా అనుకునే వారందరికి ఒక విషయం తెలియజేస్తూ వాలెంటైన్స్ డే రోజున రష్మీకి సుదీర్ ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for sudheer and rashmi

రష్మీ కోసం సుదీర్ రాసిన లెటర్ లో ఏముందంటే…. రష్మీ బయట మన గురించి చాలా చాలా అనుకుంటున్నారు. వాటి గురించి నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఎంత కష్టపడి ఇండస్ట్రీకి వచ్చావో నాకు బాగా తెలుసు. తినడానికి తిండి లేక ఛాన్సుల కోసం ఎంతలా తిరిగావో కూడా తెలుసు. అలాగే నేను కూడా ఎన్ని కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చానో నేను మర్చిపోను. ఎవరెన్ని అనుకున్నా ఎవరెన్ని ఊహించుకున్నా నా జీవితంలో నీకంటూ ఒక గొప్ప స్థానం ఉంది. దాని పేరు స్నేహం. ఐ లవ్ యువర్ ఫ్రెండ్ షిప్. దీనిని ఎవరు విడదీయలేరు. ప్రేమికుల రోజు అంటే ప్రేమికుల కోసం మాత్రమే కాదు. మనలాంటి స్నేహితుల కోసం కూడా అని చెప్పడానికే ఈరోజు ఈ లెటర్ రాస్తున్నా. త్వరగా పెళ్లి చేసుకో లేకుంటే నాలాగా ముసలిదానివి అవుతావు అని చివర్లో రాసి నవ్వించాడు. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే రష్మీ. మన స్నేహంలో ఇలాంటి వ్యాలెంటైన్స్ డేలు ఎన్నో జరుపుకుంటామని ఆశిస్తున్నా అని లెటర్ రాశాడు సుదీర్.

ఆ లెటర్ చూసి రష్మీ కంటతడి పెట్టుకుందంట. రష్మీ కళ్ళలో ఒకవైపు కన్నీళ్లు వచ్చినా సుదీర్ చెప్పిన చివరి మాటలు విని నవ్వేసింది. అయితే చివర్లో సుదీర్ మన అందరి కోసం కొన్ని మాటలు చెప్పాడు. రోడ్డు మీద అమ్మాయి అబ్బాయి కనపడితే వాళ్ళను లవర్స్ అని మనం ఊహించుకుంటున్నాం. కానీ వాళ్ళు మంచి స్నేహితులు అయ్యి ఉండొచ్చనే విచక్షణ మనం కోల్పోకూడదని అన్నాడు. ఇప్పటికైనా సుదీర్ రష్మీ స్నేహాన్ని గౌరవిద్దాం. మరి సుదీర్ రష్మిల గురించి వారి మధ్య ఉన్న స్నేహం గురించి సుదీర్ రాసిన ఈ లెటర్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.