సుడిగాలి సుధీర్ చేసిన రియ‌ల్ స్టంట్స్ చూసి ఏడ్చేసిన రష్మీ

359

జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన నటుల్లో సుడిగాలి సుధీర్ ఒకరు. ‘జబర్దస్త్’ తో వచ్చిన పాపులారిటీతో మరికొన్ని షోలు కూడా చేస్తూ బిజీ అయ్యాడు. అంతేకాదు వీలును బట్టి వెండితెరపై కూడా సందడి చేస్తూనే వున్నాడు. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తున్నాడు, బుల్లితెర‌లో సుడిగాలి సుధీర్ చేసే స్కిట్స్ కామెడీని పండిస్తుంటాయి, అందుకే సుధీర్ కోసం మ‌ల్లెమాల‌ టీమ్ఏ షో స్టార్ట్ చేసినా ,అత‌ని కంటూ ప్ర‌త్యేకంగా టీమ్ ని ఇస్తుంది, అలాగే అత‌నికి ప్ర‌త్యేకంగా షోని డిజైన్ చేస్తుంటారు.

Image result for sudheer and rashmi

అయితే అంద‌రిలా కాదు సుధీర్ ప్రేక్ష‌కులు త‌న అభిమానుల కోసం రియ‌ల్ స్టంట్స్ సీన్స్ చేస్తాడు అంటారు.. సుధీర్ ఎన్ని క‌ష్టాలు అయినా ప‌డి త‌న అభిమానుల‌ని ఎంట‌ర్ టైన్ చేస్తాను అని చెబుతాడ‌ట ..తాజాగా ఇదే నిరూపించాడు. ఇటీవ‌ల జ‌రిగిన తారాజువ్వ‌ల షోలో సుధీర్ విష్ణుప్రియ రిస్క్ చేసి డ్యాన్స్ చేశారు. ఒక క‌మెడియ‌న్ గా అంత రిస్క్ చేయడం ప‌ట్ల అంద‌రూ షాక్ అయ్యారు, అయితే ఇదంతా త‌న అభిమానుల‌కోసం అని అన్నాడ‌ట సుధీర్. గాలిలో విష్ణుప్రియ‌ని లిప్ట్ చేసి అంత సేపు సుధీర్ డ్యాన్స్ చేయ‌డం అంటే క‌ష్టం అని చెప్పాలి. సుధీర్ కు ఇటీవ‌ల ఆప‌రేష‌న్ జ‌రిగింది. కాని అవ‌న్నీ ప‌క్క‌న పెట్టి అభిమానుల కోసం ఇంత క‌ష్ట‌మైన ప‌ని చేస్తున్నాడు అని అంటున్నారు ఆయ‌న ఫ్యాన్స్.

అందుకే సుధీర్ న‌ట‌న ఆయ‌న కామెడిని వ‌దులుకోము అనిచెబుతున్నారు సుధీర్ ఫ్యాన్స్. ..ఇక తాజాగా సుధీర్ మ‌రో కొత్త కోణం చూపిస్తున్నాడ‌ట‌. ఉగాది రోజున వ‌చ్చే సుధీర్ గాడి పెళ్లి షోలో కొత్త స్టంట్లు చేయ‌బోతున్నాడు, చేతుల‌పై కార్లు వెళ్లేలా చేయ‌డం, స్టోన్స్ బ‌ద్ద‌లు కొట్టించుకోవ‌డం ఇలాంటి రిస్కీ ప‌నులుచేస్తున్నాడ‌ట‌. ఇలా సుధీర్ రిస్కీ స్టంట్స్ చేయ‌డం ర‌ష్మీ చూసి షాక్ అయింద‌ట‌. గ‌తంలో కూడా సుధీర్ ఇలాగే షూటింగ్ లో ప్ర‌మాధానికి గురి అయ్యాడు, ఇటీవ‌ల ఆప‌రేష‌న్ అయింది మ‌రి ఇలాంటి రిస్క్ ఇప్పుడు ఎందుకు అని ర‌ష్మీ క‌న్నీరు పెట్టుకుంద‌ట‌.

Image result for sudheer and rashmi

అలాగే ఆయ‌న ఫ్యాన్స్ కు ఈ స‌మ‌యంలో ఓ హ్యపీ న్యూస్ వ‌చ్చింది..త్వరలో ఆయన హీరోగా ఒక సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. బాగా పేరున్న దర్శకుడే సుధీర్ హీరోగా ఈ సినిమా చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు.గ‌తంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా ఒక చిన్న సినిమా నిర్మితమైందిగానీ, కొన్ని కారణాల వలన అది విడుదల కాలేదు. అప్పటి నుంచి హీరో వేషాలపై పెద్దగా ఆసక్తి చూపకుండా .. కమెడియన్ గానే చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సారి ఓ పేరున్న దర్శకుడే తనని సంప్రదించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. మ‌రి చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.