బిగ్ బాస్‌కు భారీ షాక్: షో నిలిపివేత.. అసలేమైందో తెలిస్తే షాక్

573

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ చివరి దశకు చేరుకుంది. విజేతగా నిలవడం కోసం ఇంటి సభ్యులంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. యువతని ఆకట్టుకునే విధంగా షో సాగుతోంది. ప్రతివారం జరుగుతున్న ఎలిమినేషన్ లు ఉత్కంఠ పెంచుతున్నాయి. హౌస్ మేట్స్ మధ్య జరుగుతున్న టాస్క్ లు ఆడియన్స్ కి వినోదాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో బిగ్ బాస్ షోని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు.ఈ షో వలన ఎలాంటి ఉపయోగం లేదు అనే వారు కూడా ఉన్నారు.ఇప్పుడు ఏకంగా ఈ షో ను నిలిపివేయాలని అంటున్నారు.మరెందుకు నిలిపివేయ్యలని అనుకుంటున్నారు.ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for big boss telugu

బిగ్ బాస్ షో అనేది యూత్ కోసం ఏర్పాటు చేసిన ఒక పోగ్రాం.ఏ బాషలలో వస్తున్నా కూడా అది యూత్ కోసమే వచ్చింది.సెలెబ్రిటిల రియల్ జీవితం ఏమిటి వారి మనస్తత్వాలు ఏమిటి..ఆ విషయాలు జనాలకు తెలియడం కోసమే ఏర్పాటు చేశారు.యువతని ఆకట్టుకునే విధంగా దీనిని రూపొందించారు. ఇదిలా ఉండగా ప్రముఖ న్యాయవాది బిగ్ బాస్ షోకి వ్యతిరేకంగా హెచ్ ఆర్ సిలో ఫిర్యాదు నమోదు చేశారు.బిగ్ బాస్ పేరుతో కొందరిని మానవ హక్కులకు విరుద్ధంగా ఇంటిలో బందించి వారిచేత అడ్డమైన పనులు చేయించడం ఎలా ఆమోదనీయమైనదని న్యాయవాది భాస్కర్ ఫిర్యాదు చేశారు.

Image result for big boss telugu

ఇంటి సభ్యులచేత బిగ్ బాస్ పేరుతో బాత్రూంలు కడిగిస్తూ, వారందరిని బానిసలుగా మార్చేలా పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు.బిగ్ బాస్ షో చూస్తున్నవారి మానసిక స్థితిపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. వింత టాస్క్ లు, వింత చేష్టలు చేయిస్తూ కుటుంబ సాంప్రదాయాల్ని మంటగలిపే విధంగా ఈ షో ఉందని అందువలన వెంటనే బిగ్ బాస్ నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.బిగ్ బాస్ షో ఇప్పటికే 78 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. మరో నెలరోజుల్లో బిగ్ బాస్ 2 వ సీజన్ పూర్తి కానుంది. దేశం మొత్తం అన్ని భాషల్లో బిగ్ బాస్ షో జరుగుతోంది.ఈ నేపథ్యంలో షో నిలిచిపోయే పరిస్థితులు ఉండవని నిపుణులు అంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బిగ్ బాస్ పై వస్తున్న ఫిర్యాదుల్ని హెచ్ఆర్ సి సీరియస్ గా తీసుకుంటే మరిన్ని నిబంధనలు విధించే అవకాశాలు లేకపోలేదు. ప్రతిరోజు వినోదాన్ని పంచుతున్న బిగ్ బాస్ షోపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత నెలకొని ఉందని చెప్పడానికి ఇదొక ఎక్సాంపుల్ మాత్రమే.చూడాలి మరి హెచ్ఆర్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.బిగ్ బాస్ షో గురించి దానికి కొంతమంది నుంచి ఉన్న వ్యక్తిరేకత గురించి షోను నిలిపెయ్యలని అంటున్నా వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.