కేటీఆర్‌కు సడెన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నటుడు సుబ్బరాజు

520

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను నటుడు సుబ్బరాజు సర్‌ప్రైజ్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొన్న కేటిఅర్ ను సుబ్బరాజు కలిశారు.కేటిఅర్ ను కలిసిన వెంటనే కారులోనుంచి చెక్ బుక్ తీసుకొచ్చి కొంత అమౌంట్ ను రాసి సి.యం రీలీఫ్ ఫండ్ కు ఇచ్చాడు.ఈ విషయం గురించి కేటిఅర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

‘రాత్రి ఫ్యామిలీ ఫంక్షన్లో ఉండగా.. సుబ్బరాజు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. సీఎం రిలీఫ్ ఫండ్‌ కోసం చెక్ అందజేశారు.మంచి మనసుతో స్పందించినందుకు థ్యాంక్స్ బ్రదర్ అంటూ ఆయన సుబ్బరాజును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. మంత్రికి సుబ్బరాజు చెక్ అందించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

మీరు సినిమాల్లో నెగటివ్ పాత్రల్లో కనిపిస్తుండొచ్చు.. కానీ నిజ జీవితంలో మీరు హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఇటీవలే‘అర్జున్ రెడ్డి’ సినిమాకు అందుకున్న ఫిల్మ్‌ఫేర్‌ను అందుకున్న విజయ్ దేవరకొండ దాన్ని వేలం వేసి రూ.25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.