సైరా లో అల్లు అర్జున్…!

325

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది..మెగాస్టార్ చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు..విజయ్ సేతుపతి , రవికిషన్, సుధీప్, తమన్నా వంటి ప్రముఖ నటీ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు..

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే మెగా డాటర్ కొణిదల నిహారిక కూడా సైరా చిత్రంలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తున్నారు. కాకపొతే ఆమె నిడివి రెండు సన్నివేశాలకు మాత్రమే పరిమితం. ఇప్పుడు అల్లు అర్జున్ ది కూడా అంతే నిడివి గల పాత్ర అని తెలుస్తోంది. అయితే చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈచిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.