స్టార్ సంగీత ఇంట్లో దారుణం..డబ్బుకోసం కన్న కూతురినే ఏం చేసారో తెలిస్తే షాక్

463

గత కొంత కాలంగా హీరోయిన్ సంగీత కుటుంబ విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఆ విషయాల గురించి మాట్లాడకుండా ఇప్పటివరకు మౌనం వహించిన సంగీత ఎట్టకేలకు పెదవి విప్పింది. తన కుటుంబంలో జరుగుతున్న దారుణాలని బయట పెట్టింది. సంగీత తెలుగు తమిళ, మలయాళీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో కుటుంబ కథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే సంగీత గ్లామర్ రోల్స్ కూడా మెరిసింది. పలు చిత్రాల్లో సంగీత నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇంతకీ సంగీత కుటుంబంలో మొదలైన ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం!

వివాహం తర్వాత:-
2009 సంగీత నటుడు, సింగర్ అయిన క్రిష్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ప్రస్తుతం ఓ కుమార్తె కూడా ఉంది. వివాహం తర్వాత సంగీత సినిమాలు బాగా తగ్గించింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం సంగీత తల్లి భానుమతి తమిళనాడు రాష్ట్ర మహిళా విభాగంలో ఓ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు సంగీతపైనే కావడం సంచలనం సృష్టించింది. దీనితో సంగీత కుటుంబ వ్యవహారాలు బయటకు వచ్చాయి.

ఇంట్లో నుంచి గెంటేసి తమిళనాడు రాష్ట్ర మహిళా విభాగంలో భానుమతి తన కుమార్తె సంగీతపై సంచలన ఆరోపణలు చేసింది. వృద్దురాలినైన తనని సంగీత ఇంట్లో నుంచి గెంటేసినట్లు పేర్కొంది. పైగా తన ఆస్తిని కాజేయాలని చూస్తున్నట్లు కూడా భానుమతి ఫిర్యాదు చేసింది. తన తల్లి చేసిన ఫిర్యాదు వలన సంగీతపై నెగిటివ్ గా ప్రచారం మొదలైంది. ఇన్నిరోజులు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్న సంగీత.. మరింత డ్యామేజ్ జరుగుతుండడంతో ఎట్టకేలకు స్పందించింది. ట్విట్టర్ పోస్ట్ లో తన తల్లిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.

డబ్బు కోసం కన్న కూతురినే సంగీత ట్విట్టర్ చేసిన కామెంట్స్ ప్రకారం సంచలన ఆరోపణలు ఉన్నాయి. తన తల్లి భానుమతి 13 ఏళ్ల వయసు నుంచే డబ్బు కోసం తనని వాడుకుందని సంగీత ఆరోపించింది. తాను సంపాదిస్తున్న డబ్బుకు ఆశపడి వయసు వచ్చినా తనకు పెళ్లి చేయలేదని సంగీత ఆరోపించింది. తన తల్లి గురించి ట్విట్టర్ మాట్లాడుతూ.. ప్రియమైన నా తల్లికి.. నాకు జన్మనిచ్చినందుకు ధన్యవాదాలు. చిన్న వయసులోనే స్కూల్ మాన్పించి డబ్బు కోసం పనికి పంపినందుకు ధన్యవాదాలు. బ్లాంక్ చెక్కులకు ఆశపడి నన్ను డబ్బు కోసం నువ్వు, నీ తాగుబోతులైన కొడుకులు బాగా ఉపయోగించుకున్నారు.. అందుకు ధన్యవాదాలు అంటూ సంగీత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.