స్టార్ హీరో భార్యకు క్యాన్సర్.. ఉలిక్కిపడ్డ సినీపరిశ్రమ.. విషాదంలో నటులు

514

ఇటీవ‌ల బాలీవుడ్ లో వ‌రుస ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి.. అలాగే ప‌లు సినిమా కుటుంబాల‌ను క‌న్నీరు పెట్టిస్తున్నాయి.. తాజాగా సోనాలి బింద్రే క్యాన్స‌ర్ తో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది ఫైన‌ల్ స్టేజ్ కు రావ‌డంతో ఆమె అమెరికా వెళ్లి చికిత్స్ చేయించుకున్నారు. తాజాగా మ‌రో సినీ కుటుంబంలో ఈ క్యాన్స‌ర్ వార్త షాక్ కు గురిచేసింది.బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా భార్య తహీరా కశ్యప్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు వెల్లడించారు. తనకు రొమ్ము క్యాన్సర్‌ సోకిందని, ప్రస్తుతం మొదటి దశలో ఉందని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా రివీల్‌ చేశారు. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కుంగిపోవాల్సిన పని లేదని, దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దని తన శ్రేయోభిలాషులను కోరారు.

Image result for తహీరా కశ్యప్

ఇది నిజంగా చాలా కఠినమైన సమయమే. కానీ నేను ధైర్యం కోల్పోలేదు. నాలాగే చాలా మంది జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉంటారు. ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాదు. మొదటిసారిగా టెస్టు చేయించుకున్నపుడు స్టేజ్‌ జీరో అని రిపోర్టు వచ్చింది. డాక్టర్‌ చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకున్నా. కానీ ఇప్పుడు అప్‌గ్రేడెడ్‌ వర్షన్‌ వచ్చింది. మహమ్మారి ముదిరిపోయింది. స్టేజ్‌ 1లో ఉన్నా. ఇప్పటికి ఆరు సెషన్లు పూర్తయ్యాయి. ఇంకో ఆరు మిగిలి ఉన్నాయి. నేనెప్పటికీ ధైర్యం కోల్పోనని నా భర్త, స్నేహితులకు మాట ఇస్తున్నా. ఈ వార్త వినగానే మీరంతా షాకయ్యారని తెలుసు. మరేం పర్లేదు. మొదటి దశలోనే ఈ విషయం బయటపడింది’ అని తహీరా ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్‌ ఉంచారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాగా రియాలిటీ షోలు, టీవీ షోలు, రేడియో జాకీగా పని చేసిన ఆయుష్మాన్‌ ‘విక్కీ డోనర్‌’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల విడుదలైన అతడి సినిమాలు ‘అంధాధూన్, బదాయి హో’ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ఇక… 2011లో తహీరాను పెళ్లి చేసుకున్న ఈ యువనటుడికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయుష్మాన్ మంచి న‌టుడిగా పేరు సంపాదించుకున్నారు ఆయ‌న‌కు బాలీవుడ్ లో ప‌లువురితో మంచి స‌త్సంబంధాలు ఉన్నాయి. మ‌రి ఆయ‌న భార్య‌కు కూడా ఈ ఆరోగ్య స‌మ‌స్య త్వ‌ర‌గా త‌గ్గిపోవాల‌ని ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నారు బాలీవుడ్ జ‌నాలు ,వారి అభిమానులు. మ‌రి మీ అభిప్రాయం మీ విషెస్ కూడా కామెంట్ల ద్వారా తెలియ‌చేయండి.