ఎన్టీఆర్ బయోపిక్ లో రాశి ఖన్నా..ఎవరి పాత్రో తెలుసా..!

404

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కధను , ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తూ తెరకెక్కిస్తున్నారు..సంచలన దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు దర్సకత్వం వహిస్తుండగా, ప్రముఖ నటీ నటులేందరో ఈ సినిమాలో నటిస్తున్నారు..స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలయిన ఫస్ట్ లుక్ లో బాలయ్య అచ్చం ఎన్టీఆర్ గెటప్ లో ఉండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి..ఇప్ప‌టికే సినిమాలో విద్యాబాల‌న్‌,మోహన్ బాబు ,సుమంత్‌,ర‌కుల్‌,కాజ‌ల్‌ను తీసుకున్న క్రిష్ ,తాజాగా సీనియ‌ర్ న‌టి జ‌య‌ప్ర‌ద పాత్ర కోసం హీరోయిన్ రాశిఖ‌న్నాని తీసుకున్నార‌ని స‌మాచారం.

గతంలో సీనియర్ ఎన్టీఆర్, జయప్రదలు కలిసి కొన్ని సినిమాల్లో కలిసి నటించారు..ఈ బయోపిక్ లో కూడా జయప్రద పాత్ర ఉంటుందని అయితే నిడివి మాత్రం ఐదు నిమిషాలే ఉంటుందని సమాచారం..ఈ పాత్ర కోసం రాశి ఖన్నా నుసంప్రదిన్చారని తెలుస్తోంది..అయితే రాశి మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం..రాశి ఖన్నా ఉంటే సినిమాకు గ్లామర్ అడ్డాలనే ఉద్దేశ్యంతో క్రిష్ ఆమెను ఎంచుకున్నాడని అర్ధమవుతోంది..బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తుండగా లక్ష్మీ పార్వతి పాత్రపై ఇంకా క్లారిటీ రాలేదు..