మంటల్లో చిక్కుకున్న స్టార్ హీరో షాక్ లో సినీ ఇండ‌స్ట్రీ

298

బాలీవుడ్‌లో టాప్‌ హీరోగా దూసుకుపోతున్నారు అక్షయ్‌ కుమార్‌. సినిమా సినిమాకు తన మార్కెట్‌ రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు అక్షయ్‌. సామాజిక ‍స్పృహతో సినిమాలు చేస్తూ.. రియల్‌ లైఫ్‌లో కూడా మంచి మనసును చాటుకుంటున్నాడు ఈ రియల్‌ హీరో. తాజాగా అక్షయ్‌ చేసిన విన్యాసం అందర్నీ ఆశ్చర్య పరిచేలా చేసింది.అక్షయ్‌ ప్రస్తుతం కేసరి సినిమాతో బిజీగా ఉండగా.. అదే సమయంలో ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. అక్షయ్‌ మంటల్లో కాలుతూ.. ఈ టైటిల్‌ను ప్రకటించాడు. ది ఎండ్‌ అంటూ ఇది కేవలం ఆరంభమే.. అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. తాజాగా రిలీజ్‌ చేసిన అక్షయ్‌ కేసరి ట్రైలర్‌ సోషల్‌ మీడియా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

Image result for అక్షయ్‌ కుమార్‌

అక్షయ్ కుమార్ తన ఒంటికి నిప్పంటించుకుని స్టేజ్‌పై నడవడంపై ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్షయ్ కుమార్ నటించనున్న ‘ది ఎండ్’ అనే వెబ్‌సీరిస్‌ ప్రకటన నేపథ్యంలో ఆయన తన ఒంటికి నిప్పటించుకుని స్టేజ్‌పై డేర్ డెవిల్ స్టంట్ ప్రదర్శించారు. అక్షయ్ అలా మంటలతో నడవడం చూసి ప్రేక్షకులు సైతం షాకయ్యారు.ఈ స్టంట్‌పై అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ‘‘యాక్షన్ నా రక్తంలోనే ఉంది. ముందుగా నన్ను నేను స్టంట్ మ్యాన్‌గానే చూసుకుంటా, ఆ తర్వాతే నటుడు. నా కొడుకు అరవ్ సూచన మేరకు నేను ఈ వెబ్‌సీరిస్‌లో నటిస్తున్నా. ఇటీవల యువత వీటినే ఎక్కువ చూస్తున్నట్లు అరవ్ చెప్పాడు. అందుకే, వారి కోసం నేను అసాధారణంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాఅని తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఈ స్టంట్‌పై అక్షయ్ భార్య ట్వింకిల్ ఘాటుగానే స్పందించింది. ‘‘ఈ విధంగా నువ్వు ఒంటికి నిప్పు అంటించుకోడానికి నిర్ణయం తీసుకున్నారన్న మాట. ఆ స్టంట్ తర్వాత బతికి ఉంటే.. ఇంటికి రా, నేనే నిన్ను చంపేస్తా’’ అని ట్వింకిల్ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్‌పై అక్షయ్ ఫన్నీగా స్పందించారు. తాను నిజంగా భయపడేది ఆమేకే అన్నట్లుగా…నన్ను నిజంగా భయపెట్టేది ఒకటి ఉంది’’ అంటూ దేవుడా నన్ను కాపాడు’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో రీట్వీట్ చేశారు. అక్షయ్ నటిస్తున్న ‘కేసరి’ మార్చి 21న విడుదల కానుంది. ‘సూర్యవంశి’ అనే మరో చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. మొత్తానికి అక్ష‌య్ డేర్ గా చేసిన ఈ సీన్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.