స్టార్ హీరోయిన్ రోడ్డుపై కూరగాయలు అమ్ముతుంది.. ఎందుకో తెలిస్తే షాక్

1177

సినిమా తారల జీవితం ఎంతో అధ్బుతంగా ఉంటుంది.పక్కన ఎప్పుడూ ఒక అసిస్టెంట్.. ఆర్క్ లైట్ల వెలుగులు, ఫ్యాన్స్ పలకరింపులు,నీళ్లడిగే జ్యూస్ తెచ్చే యూనిట్ సభ్యలు, ఇదీ హీరోయిన్ అంటే. ఒక వేళ సినిమాలు లేకపోయినా ఏ రియాల్టీ షోనో టీవీ సీరియల్సో చేసుకుంటూ హాయిగా జీవితం గడిపేయవచ్చు. అయితే కొందరి జీవితం మాత్రం తారుమారు అవుతుంది.అప్పటివరకు రాజభోగాలు అనుభవించిన వారు దీన స్థితికి వస్తారు.మహానటి సావిత్రి జీవితాన్నే దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు.కోట్లు కళ్ళతో చూసింది. అయిన చివరికి దీనంగా చనిపోయింది.అయితే ఇప్పుడు కూడా హీరోయిన్ రోడ్ల మీద కూరగాయలు అమ్ముతూ జీవిస్తుంది. అయితే ఆమె అలా కూరగాయలు అమ్మడం వెనుక బీద స్థితి అయితే ఏంలేదులెండి. దాని వెనుక ఒక కథ ఉంది.మరి ఆ హీరోయిన్ ఎవరో దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందామా.

Image result for ఆదాశర్మ

సినిమా తారలు అన్నాకా ఎంతో కష్టపడాలి.పాత్ర కోసం పడరాని పాట్లు పడాలి.ఎంత కష్టం అయిన సరే అనుభవించాలి.పాత్రలో లీనమైపోవాలి.నటించింది అని తెలియకుండా ప్రేక్షకులను మంత్రముగ్దులను చెయ్యాలి.హీరోయిన్స్ కు అప్పుడప్పుడు కొన్ని చాలెంజింగ్ పాత్రలు వస్తుంటాయి.వాటికి తగిన న్యాయం చెయ్యాలి అప్పుడే నటనకు న్యాయం చేశాం అని అనిపిస్తుంది.ఇప్పుడు ఈ పేరు తెచ్చుకోడానికే ఒక హీరోయిన్ తెగ కష్టపడుతుంది.హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన హీరోయిన్ ఆదాశర్మ.ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. అయితే పనికి తగ్గ ప్రతిఫలం గురించి ఆలోచించకుండా అదా శర్మ ఎప్పుడూ ఎనర్జీ తో ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తనకు సంబంధించిన పిక్స్, వీడియోస్‌తో అభిమానులకు ఐ ఫీస్ట్ చేస్తుంటుంది.కానీ ఆ హీరోయిన్‌ ఇప్పుడు రోడ్డు మీద కూరగాయలు అమ్ముతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రోడ్డు పక్కన బాగా మాసి, చినిగిన చీరకట్టుకొని నిద్రలేమితో, అలసిపోయినట్టుగా కనిపిస్తూ అభిమానులకు షాక్‌ ఇచ్చారు.క్షణం తరువాత టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్‌ బాట పట్టారు. ఈ బ్యూటీ త‍్వరలో ఓ హాలీవుడ్‌ సినిమాలో నటించనున్నారు. ఆ సినిమా కోసమే అదా ఈ డీగ్లామర్‌ లుక్‌లో ఫొటో షూట్ చేసినట్టుగా తెలుస్తోంది.అందులో కూరగాయలు అమ్మే అమ్మాయి పాత్ర చేస్తుంది.అందుకే ఇప్పుడు ఈ అవతారం ఎత్తింది.ప్రస్తుతం అదా కూరగాయలమ్ముతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మీరు కూడా చూడండి గుర్తుపట్టలేనంతలా ఎలా అయ్యిందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఆదాశర్మ చేస్తున్న క్యారెక్టర్ కోసం ఇలా అవ్వడం గురించి అలాగే పాత్ర కోసం ఎంతైనా కష్టపడే నటుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.