పెళ్లయిన హీరోయిన్‌పై మనసుపడిన ఎస్.ఎస్.రాజమౌళి

834

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతుండగా, విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభంకాగా, హీరోయిన్లతో ఇతర నటీనటుల ఎంపిక మాత్రం ఇంకా జరగలేదు. అయితే రాజ‌మౌళి బాలీవుడ్ భామ‌ల‌ను ఈ సినిమాకు ఎంచుకుంటారు అని అందుకే ఇంకా ఎవ‌రి పేరు తెర‌పైకి రాలేదు అని తెలుస్తోంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఓ వార్త మాత్రం బాగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది, ఈ సినిమాలో ఓ సీనియ‌ర్ హీరోయిన్ ని రాజ‌మౌళి తీసుకుంటున్నార‌ట‌.

Image result for rajamouli

అయితే, మాజీ హీరోయిన్ ప్రియమణి ట్రిబుల్ ఆర్‌లో ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘యమదొంగ’లో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఈ సినిమా ప్రియమణికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.ఆ తర్వాత కొంత మంది స్టార్ హీరోలతో ప్రియమణి నటించింది. వివాహం తర్వాత ప్రియమణి నటనకు దూరం కావడంతో మళ్లీ వెండితెరపై కనిపించలేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కానీ, ట్రిపుల్ ఆర్ చిత్రం ద్వారా ప్రియమణి మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుందని అంటున్నారు… ఈ చిత్రంలో పవర్‌ఫుల్ లేడీ విలన్‌గా ప్రియమణి కనిపించనుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా చేయాలి అని చూస్తున్న రాజ‌మౌళి ఈ సినిమాని వ‌చ్చే ఏడాదిలో పూర్తి చేయాలి అని భావిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. మ‌రి ప్రియ‌మ‌ణి అలాగే ఇంకెవ‌రు ఈ చిత్రంలో న‌టిస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.