మా వివాదంలో దూరిన శ్రీరెడ్డి..శివాజీ రాజా గోచీ ఊడింది…ముందుండి ముసళ్ల పండుగ..

341

గత రెండు రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో నడుస్తున్న ‘మా’ వివాదం రోజురోజుకు మారుతుంది.ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేస్తూ మా పరువు తీస్తున్నారు.మీరు తిన్నారంటే మీరు తిన్నారని ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేస్తున్నారు.మా అధ్యక్షుడు శివాజీరాజా, శ్రీకాంత్ తదితర సభ్యులు నిధులు దుర్వినియోగం చేశారంటూ మా జనరల్ సెక్రటరీ నరేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేయడంతో ఈ వివాదం టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది.

actress sri reddy reacts on movie artist association controversy

సవాళ్లు, ప్రతి సవాళ్లతో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ రచ్చ రచ్చగా మారింది.ఈ సందర్భంలో ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న నటి శ్రీరెడ్డి మా సభ్యులపై తీవ్రస్థాయిలో మండి పడుతూ.. ఫేస్ బుక్ ద్వారా వివాదాస్పద కామెంట్స్‌ షేర్ చేసింది.నన్ను పబ్లిసిటీ స్టంట్ అన్న శివాజీరాజాకి, శ్రీకాంత్‌కి గోచీ ఊడి.. దరిద్ర్యపు గతి పట్టింది. మోసపోయి నేనొస్తే.. ఓదార్చాల్సింది పోయి బడా ఫ్యామిలీని కాపాడే ప్రయత్నం చేశారు. నాకు కోట్ల రూపాయలు ఇవ్వాలని శివాజీ రాజా అతని తొత్తులు ప్రయత్నిస్తే నేను కడుపు మండి తీసుకోలేదు. నా విషయంలో శివాజీరాజా ప్రవర్తన బాధాకరం.

సంబంధిత చిత్రం

వీళ్లు సెటిల్ మెంట్‌లు చేసే గూండాలు.. ఆడ పిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్స్.. తల్లిదండ్రుల్నే చూడలేదు శివాజీ రాజా. ముసలివాళ్లకు ఆశ్రమం గురించి అమెరికాలో గంతులేశారట. తూ.. మీ బతుకు.డబ్బంతా పంచుకు తింటున్నారు.. అందరూ తోడు దొంగలే. దానికి బడా హీరో వాటా పెద్ద మొత్తం. దానికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది. అమెరికాలో ఏం జరిగిందో. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు ఉండాలి. ఆడపిల్లల ఏడుపు ఊరికే పోదు.. ఏడ్వండి. ఇంకా ఉంది ముసల్ల పండగ. కీప్ ఇట్ నరేష్ గారూ అంటూ శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.