ప్లాప్ దర్శకుడితో సినిమాకు అఖిల్ సిద్ధం ..నాగార్జున ఒప్పుకున్నాడా?

254

అక్కినేని అఖిల్ కు ఏ సినిమా కూడా కలిసిరావడం లేదు. మాస్ క్లాస్ సినిమాలు తీసిన కూడా జనాలను ఆకట్టుకోలేకపోతున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన మిస్టర్ మజ్ను కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో అఖిల్ నెక్స్ట్ ఏ దర్శకుడితో పనిచేస్తాడనే ఆసక్తి సాధారణంగానే పెరుగుతుంది.

Related image

అఖిల్ నెక్స్ట్ మూవీ గురించి అక్కినేని అభిమానులు షాక్ కి గురయ్యే న్యూస్ వినిపిస్తోంది. అఖిల్ తదుపరి చిత్ర దర్శకుడిగా శ్రీను వైట్ల పేరు వినిపిస్తోంది. అఖిల్ తో తాను ఓ చిత్రాన్ని చేస్తానని, అఖిల్ కోసం కథ కూడా సిద్ధం చేసుకున్నానని శ్రీనువైట్ల చెబుతున్నాడు.

Image result for akhil srinuvaitla

అయితే అఖిల్ కు ఇప్పటికే వరుసగా మూడు చిత్రాలు నిరాశపరిచాయి. ఇప్పుడు ఖచ్చితంగా హిట్ కొట్టాలి. కానీ శ్రీను వైట్ల అఖిల్ నెక్స్ట్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడనే ప్రచారం అక్కినేని అభిమానులని కలవర పెడుతోంది. శ్రీను వైట్ల ప్రస్తుతం ఏమాత్రం ఫామ్ లో లేని దర్శకుడు.ఈ తరుణంలో అఖిల్, శ్రీనువైట్ల కాంబోకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది ప్రశ్నగామారింది.ఎందుకంటే శ్రీనువైట్లకు హిట్స్ లేక చాలా కాలం అయ్యింది.